English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో గులాబీపురం వర్సెస్ జిలేబీపురం!

బిగ్ బాస్ సీజన్-7 లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. గ్రహాంతర వాసులని సంతోషపరిచే టాస్క్ లు హౌజ్ మేట్స్ వేషధారణ, మాట తీరు, ఆటతీరు అంతా కలిసి కామెడీని కలిగిస్తున్నాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న బాక్స్ కి తాళాలు వేసి ఉండగా వాటిని బయట ఉన్న తాళం చెవిల సహాయంతో ఓపెన్ చేసి అందులో ఉన్న ఫ్యూయల్ బాటిల్ ని బయటకు తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పాడు.

గులాబీపురం నుండి టేస్టీ తేజ, అమర్ దీప్, జిలేబీపురం నుండి ప్రియాంక జైన్, ఆట సందీప్ ఈ టాస్క్ లో పాల్గొనగా ఇందులో మొదటగా అన్నీ తాళాలు ఓపెన్ చేసింది జిలేబీపురం. ఆట సందీప్ ఫాస్ట్ గా అన్ని తాళాలు ఓపెన్ చేశాడు. అయితే ఆ బాక్స్ మూతని తీసేటప్పుడు ఆట సందీప్, అమర్ దీప్ ల మధ్య ఫిజికల్ అయింది. ఆ తర్వాత ఆట సందీప్ ఫ్యుయల్ ఉన్న బాటిల్ ని తీసి ప్రియాంక జైన్ కి ఇవ్వగా, తను టార్గెట్ లో పెట్టి రౌండ్ ముగించింది. దీంతో జిలేబీపురం ఈ టాస్క్ లో గెలిచింది. ఆ తర్వాత టేస్టీ తేజ, శోభాశెట్టి మధ్య టాటు గురించి డిస్కషన్ రాగా, బిగ్ బాస్ సీరియస్ గా తీసుకున్నాడు.

ఇక ఆ తర్వాత స్పేష్ షిప్ కి ఉండే వైర్ లు అన్నీ గజిబిజిగా ఉన్నాయని , వాటిని ఎవరైతే సరిగ్గా కనెక్షన్ చేసి తమ జెండాలని అందులో మొదటగా అమర్చినవారే అర్హులని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ పాల్లొనగా అతి తక్కువ టైమ్ లో గౌతమ్ కృష్ణ గెలిచాడు. దీంతో జిలేబీపురంలోని హౌజ్ మేట్స్ మెజారిటీ టాస్క్ లు గెలిచి ఫైనల్ టాస్క్ కి చేరుకున్నారు. మరి ఈ ఫైనల్ టాస్క్ లో గెలిచేదెవెరో? ఈ వారం కెప్టెన్ గా ఎవరు అవుతారనే క్యూరియాసిటి ఇప్పుడు ప్రేక్షకులలో నెలకొంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.