English | Telugu

సంచాలకుడిగా శివాజీ తోపు.. సీరియల్ బ్యాచ్ ఆటకట్టించాడుగా!


కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరిని కలిపి బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం జిలేబిపురం వర్సెస్ గులాబీపురం టీమ్ ల మధ్య టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఎవరు ఫౌల్(తప్పు) గేమ్ ఆడారు? ఎవరు కరెక్ట్ గేమ్ ఆడారో ఒకసారి చూసేద్దాం.

గ్రహాంతర వాసులని సంతోషపరిచాడనికి వారికి ఫ్యూయల్ కావాలని అది స్విమ్మింగ్ పూల్ లో ఉందని, దానిని తీసుకురావాలని చెప్పగా ఆట సందీప్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా, ప్రియాంక జైన్ బయట ఉన్న ఒక్కో తాళం చెవిని ఇస్తుంది. అయితే ఈ ఆటలో ఇద్దరు కలిసి స్ట్రాటజీనీ ప్లే చేశారు. అదేంటంటే మొదటగా సందీప్ మాస్టర్ కి ప్రియాంక జైన్ తాళం చెవి ఇవ్వగా అది వస్తుందని చెప్పి, తన ప్యాంట్ లో దాచుకున్నాడు. ఇక సంచాలకుడిగా వ్యవహరిస్తున్న శివాజీ అది చూసేశాడు. ఒకసారి తీసుకెళ్ళిన తాళం చెవిని మళ్ళీ తిరిగి ఇస్తేనే మరో తాళం చెవి తీసుకెళ్ళాలని షరతుని ఉంచాడు. దాంతో వాళ్ళ పాచిక పారలేదు. వెంటనే ఆ కీని తిరిగి ప్రియాంకకి ఇచ్చేశాడు సందీప్. ప్రతీ టాస్క్ లో ఫౌల్ ఆడుతూ దానిని స్ట్రాటజీ అని చెప్పుకునే సీరియల్ బ్యాచ్ కి శివాజీ సంచాలకులుగా ఉంటేనే బుద్ధి వస్తుందని మరోసారి ఋజువు చేశాడు.

ఇక ఆ తర్వాత ఈ టాపిక్ ని టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, యావర్ లతో శివాజీ డిస్కస్ చేశాడు. ఆట ముగిసాక అమర్ దీప్, ప్రియాంక జైన్, ఆట సందీప్ కలిసి మాట్లాడుకుంటున్నారు. "స్విమ్మింగ్ పూల్ లో నాకు కోపం వచ్చి వాడి బనియన్ పట్టుకున్నాను. అమర్ ప్లేస్ లో ఎవరున్నా గట్టిగా గొడవ అయ్యేది" అంటూ అమర్ , ప్రియాంకలతో ఆట సందీప్ అన్నాడు. హౌస్ లో మొదటి నుండి అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్ అందరు కలిసి గ్రూప్ గా గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. అయితే వీరికి శివాజీ సంచాలకుడిగా ఉంటేనే కరెక్ట్ అని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.