English | Telugu

తేజకి బిగ్ బాస్ వార్నింగ్.. ఎపిసోడ్-47 రివ్యూ!

బిగ్ బాస్ సీజన్-7 లో ఇప్పటికే ఆరు వారాలు పూర్తయ్యాయి. ‌ఇప్పుడు ఏడో వారం కొనసాగుతుంది. అయితే ఇందులో వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. కాగా ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారిలో అశ్విని, పూజామూర్తి, టేస్టీ తేజ లీస్ట్ లో ఉన్నారు.

నలభై అయిదవ రోజు మైండ్ బ్లాక్ పాటతో మొదలైంది. పాటకి హౌస్ మేట్స్ అంతా అదిరిపోయే స్టెప్పులేసి రోజుని ప్రారంభించారు. ఆ తర్వాత టీ స్టాల్ బంటి గా అమర్ దీప్, అందమైన అమ్మాయిగా అశ్విని, అంబటి అర్జున్ రౌడీగా, అతనికి చెంచాగా పల్లవి ప్రశాంత్, విడిపోయిన భార్యభర్తులుగా శోభాశెట్టి, టేస్టీ తేజ, పెద్ద మనిషిగా శివాజీ వారి వారి పాత్రలలో పర్ఫామెన్స్ మొదలెట్టారు. అయితే మళ్ళీ స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో అటువైపు ఆట సందీప్, ప్రియాంక జైన్ స్ట్రాటజీతో గెలిచారు. ఇక ఇటు వైపు అమర్ దీప్, టేస్టీ తేజ అలా గెలవలేకపోయారు‌. అదంతా చూసిన శోభా శెట్టిలో మోనిత బయటకొచ్చేసింది. మాస్టర్ అండ్ ప్రియాంక ఫౌల్ ఆడుతున్నప్పుడు నువ్వు కూడా అలానే ఆడాలి కదా తేజ అని అడుగగా.. అది ఫౌల్ కదా నాకు అలా రాదని తేజ అంటాడు. దాంతో అలా రానప్పుడు ఎందుకెళ్ళావ్ అంటూ తెగ ఫీల్ అయిపోయింది.

ఆ తర్వాత బ్యాటరీ వైర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ మధ్యలో జరిగిన ఈ టాస్క్ లో స్వల్ప తేడాతో గౌతమ్ కృష్ణ గెలిచాడు. గేమ్ ముగిసాక బిగ్ బాస్ శోభా అనే పేరు రాసి ఒక కేకు పంపించాడు. దానికి ఒక వార్నింగ్ కూడా పంపించాడు. ముందుంది ముసళ్ళ పండగ తేజ అని వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్లో ఈసారి టేస్టీ తేజ చివర్లో ఉన్నాడు. బహుశా ఇది అతనికి ఒక హెచ్చరిక కావొచ్చు. మరి ఇది అర్థం చేసుకొని తేజ ఆడతాడో లేదో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.