English | Telugu
నా భర్త 'రేసుగుర్రం'లో శ్రుతి హాసన్ లాంటోడు!
Updated : Feb 21, 2022
`జబర్దస్త్` కామెడీ షో గత కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోకి న్యాయ నిర్ణేతలుగా నటి, ఎమ్మెల్యే రోజా, సింగర్ మనో వ్యవహరిస్తున్నారు. తాజా ప్రోమోలో రోజా తన భర్త ఆర్.కె. సెల్వమణిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు నెట్టింట వైరల్ గా మారాయి. "సెల్వమణి 'రేసుగుర్రం'లో శృతిహాసన్ లాంటోడు" అంటూ రోజా సెల్వమణిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. `జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్ లో రెట్రో థీమ్ తో టీమ్ మెంబర్స్ స్కిట్ లు చేయడం మొదలుపెట్టారు.
ఇందులో భాగంగానే రోజా , సెల్వమణిలను అనుకరిస్తూ కమెడియన్ నూకరాజు ఓ సెటైర్ వేశాడు. ఇందులో ఇద్దరు కమెడియన్ లు రోజా ఇంటికి వెళ్లి ఆమె కొత్తింటిని చూద్దామనుకుంటారు. ఇంతలో రోజా వస్తోందని తెలిసి ఆమెకి కనిపించకుండా దాక్కుంటారు. రోజా పాత్రలో నటించిన నటి గాంభీర్యంగా చూస్తూ ఎంట్రీ ఇచ్చి అబ్బాయిలకు అన్యాయం జరిగితే అరగంట ఆలస్యం అవుతుందేమో కానీ అమ్మాయిలకు అన్యాయం జరిగితే మాత్రం అరనిమిషం కూడా ఆలస్యం చేయనంటూ పంచ్ వేస్తుంది. ఇంతలో స్టేజ్ పైకి వచ్చిన నూకరాజు రెచ్చిపోయి రోజాపై పంచ్ వేశాడు. "నా నోరు లాగుతుంది.. రోజా అందంగా వుంది" అని.. "నేనే సెల్వమణి" అని పంచ్ వేశాడు. దీనికి ఆశ్చర్యపోయిన రోజా నూకరాజుని చూసి నవ్వేసింది. ప్రేమగా అతన్ని అభినందించింది.
Also Read:బాలీవుడ్ డైరెక్టర్ కోసం 'బబ్లీ బౌన్సర్'గా మారిన తమన్నా
ఇదే సందర్భంగా రోజా తన భర్త సెల్వమణి సీక్రెట్ బయటపెట్టింది. నూకరాజు స్కిట్ ని ఉద్దేశిస్తూ .. సెల్వమణి 'రేసుగుర్రం'లో శృతిహాసన్ లాంటోడని.. అన్నీ లోపలే అనుకుంటాడని, బయటకు చెప్పడని కామెంట్ చేసింది రోజా. అంతే కాకుండా స్కిట్ లో చెప్పిన డైలాగ్ లు పేపర్ పై రాసి ఇవ్వాలని ఇంటికెళ్లాక సెల్వమణితో చెప్పించుకుంటానని తెలిపింది రోజా. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న జబర్దస్త్ కి సంబంధించిన ఈ ప్రోమో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.