English | Telugu
ఆపరేషన్ పేరుతో బాబాయ్‌కి స్పాట్ పెట్టిన మోనిత
Updated : Feb 21, 2022
బుల్లితెర పై ప్రసారం అవుతున్న క్రేజీ సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సీరియల్ టైమింగ్ గురించి ట్వీట్ చేసే స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని నెలలుగా ఈ సీరియల్ పాపులారిటీ తగ్గుతూ వస్తోంది. వంటలక్క - డాక్టర్ బాబు పాత్రల్లో నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ నటించారు. ఈ సీరియల్ తో వీరిద్దరూ టాప్ సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ మండే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా సాగబోతోంది. తన బాబాయ్ ని అడ్డుపెట్టుకుని కార్తీకి మళ్లీ బుక్ చేయాలని మాస్టర్ ప్లాన్ చేసింది.
Also Read:రాగసుధకు ఎదురుపడిన ఆర్య వర్థన్ ఏం జరగనుంది?
ఇదిలా వుంటే సౌందర్య .. మోనిత బాబాయ్ కి జరిగిందంతా చెబుతుంది. మోనిత ఎలా నాటకమాడిన తీరుని వివరిస్తుంది. నీకు నా కొడుకు ఆపరేషన్ చేస్తాడు. అయితే ఆ తరువాత నువ్వు మోనితని తీసుకుపని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కండీషన్ పెడుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మోనిత .. కార్తీక్ కు తనకు వున్న సంబంధం నిజమేని చెబుతుంది. ఆపరేషన్ కానివ్వండి.. నాకొడుకు దొరకనివ్వండి ఆ తరువాత మీ జోలికి రాను అంటూ సౌందర్యని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.
Also Read:అనుని భయపెట్టిన టెడ్డీబేర్ ఎవరు?
బాబాయ్ ఆపరేషన్ వెనక మోనిత మరో కుట్రకు తెరలేపుతోందని గ్రహించిన సౌందర్య భయపడుతుంటుంది. ఇదే విషయాన్ని దీపతో చెబుతుంది. దీంతో కార్తీక్ ని మళ్లీ ఇరికించే ప్రయత్నం ఏదో మోనిత చేయబోతోందని కార్తీక్ ఫ్యామిలీ అంతా ఆలోచిస్తుంటారు. కట్ చేస్తే తన బాబు ఎక్కడున్నాడో మోనితకు తెలిసిపోతుంది. ఈ క్రమంలో మోనిత ఎలాంటి ప్లాన్ వేసింది. కార్తీక్ ని ఆపరేషన్ నెపంతో మరోసారి మోనిత బుక్ చేయబోతోందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.