English | Telugu

డిజేబుల్ అయిన రోహిత్ ఇన్ స్టాగ్రామ్.. బిగ్ బాస్ టీం రోహిత్ ని టార్గెట్ చేసారా?

బిగ్ బాస్ రోజు రోజుకి సరికొత్త మలుపులతో, సరికొత్తగా మారుతూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ లో ది బెస్ట్ కంటెస్టెంట్ గా, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటున్న రోహిత్, సోషల్ మీడియా అకౌండ్ డిజేబుల్ అయింది.

అయితే రోహిత్ ఫ్యాన్స్ అంతా తనకి సంబంధించిన అప్డేట్స్ కోసం అతనిఇన్ స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారు, కానీ ఇప్పుడు అది డిజేబుల్ అయింది. దీంతో అందరిలో గందరగోళం ఏర్పడింది. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన రోహిత్ భార్య మెరీనా, ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. అయితే తాజాగా రోహిత్ నామినేషన్లో‌ ఉండగా ఓటింగ్ లో‌ దూసుకెళ్తున్నాడు. రేవంత్ తో పోటీగా మొదటి స్థానానికి పోటీపడుతున్న రోహిత్ కి బిగ్ బాస్కి రాకముందుఎలాంటి ఫ్యాన్ బేస్ లేకపోవడం గమనార్హం. అయితే "రోహిత్ అకౌంట్ డిజేబుల్ అయింది. సపోర్ట్ గా ఉండండి ఫ్రెండ్స్, బిగ్ బాస్ కావాలనే.. రోహిత్ ని ఎక్కువగా ఎపిసోడ్ లో చూపించట్లేదు" అంటూ ఎమోషనల్ అయ్యింది మెరీనా.

అయితే "బిగ్ బాస్ రోహిత్ ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు" అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా రోహిత్ ప్లేస్ లో, కీర్తి భట్ ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది. అందుకే రోహిత్ ని ఎక్కువగా చూపించట్లేదని రోహిత్ కి సపోర్ట్ గా, మెరీనా తన ఇన్ స్టాగ్రామ్ లో‌‌ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి రోహిత్ కి సంబంధించి అప్డేట్ ఇస్తూ వస్తుంది. "రోహిత్ ఇన్ స్టాగ్రామ్ డిజేబుల్ అయ్యింది. సపోర్ట్ చేయండి. ఎవరో కావాలని డిజేబుల్ చేసారు. మేం‌ రిక్వెస్ట్ చేసాం. ఇంకో ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ నార్మల్ అవుతుందనిచెప్పారు. ప్రస్తుతం నా ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. మీరు చేసే ప్రతీ ఒక్క ఓటు కూడా చాలా విలువైంది" అంటూ మెరీనా ఎమోషనల్ అయ్యింది. కాగా ఈ విషయమై బిగ్ బాస్ పీఆర్టీమ్వాళ్ళు రోహిత్ ని టాప్-5 లో ఉండనివ్వొద్దు అని ఇలా చేసారేమోనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.