English | Telugu

ఇనాయ కప్పు గెలిస్తే హగ్ అడుగుతా..పది రోజులు స్నానం కూడా చేయను!


ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్జీవీ హవానే బాగా వీస్తోంది. రకరకాల ఇంటర్వ్యూస్ లో కనిపిస్తూ డిఫరెంట్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు.

ఇక అలాంటి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్ బాస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. "బిగ్ బాస్ హౌస్ లోకి నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు కానీ నాకు అసలు ఇంటరెస్ట్ లేదు అసలు వెళ్ళను కూడా. ఒక్కసారి అనుకుంటా సన్నీలియోన్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఒక పావుగంట చూసా అంతే. ఒక వేళ బిగ్ బాస్ హౌస్ లో 15 మంది అమ్మాయిలు ఉంటే మాత్రం మేల్ కంటెస్టెంట్ గా నేను వెళ్తా..ఎవరు ఏం అనుకున్నా దానికి నాకు సంబంధం లేదు..ఇనాయ కోసం సపోర్ట్ చేస్తాను కానీ ఆమె కోసం షో ఎందుకు చూడాలి ? పోనీ నాగార్జున గారు ఉంటే మాత్రం బిగ్ బాస్ స్టేజి మీదకు ఎందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇనాయ గెలిచి కప్పు తీసుకుని బయటికి వస్తే గనక ఒక హగ్ కావాలని అడుగుతాను.

తర్వాత పది రోజుల పాటు స్నానమే చేయను. టీవీ షోస్ దేని మీద కూడా నాకు పెద్దగా ఇంటరెస్ట్ ఉండదు. అసలు స్టేజి మీదకు కానీ హౌస్ కానీ వెళ్లి వాళ్లంతా అక్కడ ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు..ఎవరూ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. ఒక వేళ ఇనాయ కోసం బిగ్ బాస్ టీమ్ గనక నన్ను పిలిస్తే వెళ్తాను ఎందుకంటే ఆమెను హగ్ చేసుకోవడానికి కచ్చితంగా వెళ్తాను" అని చెప్పారు ఆర్జీవీ.