English | Telugu

తండ్రికి బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన రోహిణి

బుల్లితెర మీద జబర్దస్త్ రోహిణి పేరు తెలియని వారు లేరు. ముందు తెలుగు సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరయింది. లేడీ కమెడియన్ గా ఈమె మంచి పేరే తెచ్చుకుంది. వీటితో పాటు ఆమె నటనకు అవార్డులు కూడా వచ్చాయి. రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. రకరకాల వీడియోలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఈమె వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.

లేటెస్ట్ గా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని అప్ లోడ్ చేసింది. అందులో ఆమె తన తండ్రికి ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటి అంటే వాళ్ళ నాన్నకు ఒక కొత్త బైక్ ని కొని పెట్టింది. వాళ్ళ నాన్నకు బైక్ అంటే చాలా ఇష్టం అని. బైక్ మీద ఊరంతా తిరగాలని కోరిక ఉందని ఒకసారి మాటల సందర్భంలో చెప్పేసరికి ఇక రోహిణి తన తమ్ముడితో కలిసి షోరూంకి వెళ్లి.. హొండా షైన్ బైక్ ను కొన్నది రోహిణి. ఆ బైక్ ని చూసిన ఆమె తండ్రి చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తన బంగారు తల్లి తనకు బైక్ కొనిపెట్టినందుకు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఆ తర్వాత ఆయన రోహిణి వాళ్ళ అమ్మను బైక్ మీద ఎక్కించుకుని అలా ఒక రౌండ్ వేసి వచ్చి తర్వాత రోహిణిని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. పిల్లల కోరికలు తల్లిదండ్రులు వద్దన్నా తీరుస్తారు అందుకే నేను మా నాన్న కోరిక తీర్చాను అంది రోహిణి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.