Read more!

English | Telugu

హౌస్ లో కొత్త  కెప్టెన్ ఆదిరెడ్డి!

బిగ్ హౌస్ లో వారానికొకరిని కెప్టెన్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఈ వారం కొత్తగా కెప్టెన్సీ కోసం పోటీదారుల మధ్య గట్టి పోటీ జరిగింది.

పంతొమ్మిదవ రోజు రెండవ కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ క్లుప్తంగా కంటెస్టెంట్స్ కి వివరించాడు. "టాస్క్ పేరు 'ఎత్తర జెండా'. ఇందులో ఎవరు గెలుస్తారో వారే ఈ వారం హౌస్ లో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ టాస్క్ కి సంచాలకులురాలిగా ఆరోహి ఉంటుంది" అని బిగ్ బాస్ వివరించాడు .ఆ తర్వాత టాస్క్ లో ఆదిరెడ్డి విజేతగా నిలిచాడు.

ఆదిరెడ్డి విజేతగా నిలిచిన తర్వాత చాలా సంతోషంగా తనకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 'హ్యాపీ..లవ్ యూ కవిత' అని తన భార్యకు థాంక్స్ చెప్పాడు.  ఆ తర్వాత తనని నమ్మిన బిగ్ బాస్ కి, సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకున్నాడు. "ఆదిరెడ్డి.. మీరు ఫినోలెక్స్ పైప్స్ తో చేసిన సింహాసనం మీద కూర్చొని, కెప్టెన్ బాధ్యతలు స్వీకరించండి" అని బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఆదిరెడ్డి సింహాసనం మీద కూర్చున్నాడు. హౌస్ మేట్స్ అందరూ చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు. చివరగా ఆదిరెడ్డి మాట్లాడుతూ 'ఇంకా చాలా ఉంది' అని చెప్పాడు.

ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి, రోజు రోజుకి తన పర్ఫామెన్స్ తో దూసుకుపోతున్న ఆదిరెడ్డి కెప్టెన్ గా ఎన్నికయ్యాడని ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు.