English | Telugu

నా కోసం చాలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్

కార్తీక దీపం సీరియల్ ద్వారా భాగ్యం గా ఎంతో ఫేమస్ అయ్యింది ఉమాదేవి. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అక్కడ లోబోతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ద్వారా కూడా ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల ఈమె క్యాష్ షోకి వచ్చింది. ఐతే బిగ్ బాస్ షోలో లోబోతో చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఆమెను దారుణంగా ట్రోల్ చేసేసారు నెటిజన్స్. దాంతో ఆమెకు ఆఫర్స్ లేకుండా పోయాయి. దానికి తోడు కార్తీక దీపం సీరియల్ లో ఆమె క్యారెక్టర్ కూడా ఐపోయేసరికి ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉంది.

ఇక ఇప్పుడు ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చింది. ఇందులో ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి, మ్యారేజ్ లైఫ్ గురించి, సింగల్ పేరెంట్ కి వుండే కష్టాల గురించి చెప్పింది. ప్రతీ షోలో కూడా తన సమస్యలు చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. "నేను ఇప్పటివరకు ఎవరికీ థ్యాంక్స్ చెప్పలేదు. మా అమ్మకు కూడా. ఇప్పుడు నా పెద్ద కూతురికి థాంక్స్ చెప్పాలి" అంటూ ఆమెను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది.

"పెద్ద కూతురికి, రెండో కూతురికి మధ్య పదేళ్లు గ్యాప్ వచ్చింది. కనేసి వెళ్ళిపోయాడు అంతే. చిన్న కూతురిని పెద్ద కూతురు కన్న తల్లిలా చూసుకునేది. నా చిన్న కూతురు పెద్దమనిషయ్యింది. అప్పటికి నేను ఇంట్లో లేను. హరిత ఎంతో పెద్ద మనసు చేసుకుని చీర పెట్టింది. ఆ ఫంక్షన్ పేరెంట్స్ చేయాలి.. కానీ జాకీ వాళ్ళ ఫ్యామిలీ చేశారు. వీళ్లకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి" అంది ఉమాదేవి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.