English | Telugu
ఆ పని చేసి డబ్బు సంపాదిస్తున్న రష్మీ...రాకేష్ కామెంట్స్ వైరల్
Updated : Dec 28, 2022
బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు స్మాల్ స్క్రీన్ మీద అటు బిగ్ స్క్రీన్ మీద దున్నేస్తోంది. ఇటీవలే 'బొమ్మ బ్లాక్ బస్టర్' మూవీలో నటించింది. ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, అప్పుడప్పుడూ స్పెషల్ ఈవెంట్లు , సోషల్ మీడియాలో ఫోటో షూట్లు, పర్సనల్ ట్రిప్స్ ఫొటోస్, వీడియోస్ పెడుతూ ఉంటుంది. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది రష్మీ. రీసెంట్ గా 'ఎక్స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇందులో జడ్జ్ ఖుష్బూ తనదైన స్టెప్పులు వేసి అలరించింది. కమెడియన్లు పంచులతో నవ్వించారు. ఐతే రాకింగ్ రాకేష్ మాత్రం యాంకర్ రష్మీ సంపాదనపై కామెంట్స్ చేశాడు. 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' ఎపిసోడ్లో భాగంగా రాకేష్ తన స్కిట్లో స్వామీజీలా దర్శనమిచ్చాడు. ఇందులో అతడి కో- ఆర్టిస్టు ప్రవీణ్.. రష్మీ జాతకం చెప్పమని అడిగాడు. దీనికతను 'అందరూ డబ్బులు లేకపోతే గుండెలు బాదుకుంటారు. కానీ, ఈ అమ్మాయి గుండెలు బాదుకుంటూ డబ్బులు సంపాదిస్తోంది' అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ డైలాగ్ కి అంతా నవ్వేశారు.