English | Telugu

బాడీ షేమింగ్ కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్న కమెడియన్స్..షో నుంచి తప్పుకుంటున్న కొత్త యాంకర్!

జబర్దస్త్ దాదాపు పదేళ్లకు పైగా నడుస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం మీద ఎన్ని వివాదాలు, తగాదాలు వచ్చినా ఈ షో మాత్రం చక్కగా నడుస్తూ వెళ్తోంది. చాలా మంది వెళ్లిపోవడం రావడం వంటివి జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.

ఇకపోతే ఈ జబర్దస్త్ లో ఎక్కువగా బాడీ షేమింగ్ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కామెంట్స్ కారణంగా అనసూయ షో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిపోయేసరికి సౌమ్యరావుని రంగంలోకి దింపింది యాజమాన్యం. ఐతే ఇప్పుడు సౌమ్య కూడా షో నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ పై కాంట్రవర్షియల్ కంటెంట్ ఎక్కువైపోతోంది. షో నుంచి బయటకు వెళ్లినవాళ్లు జబర్థస్త్ పై గట్టిగానే విమర్షలు చేస్తున్నారు. అంతేకాదు జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.

కొన్ని ఎపిసోడ్స్ బానే చేసిన సౌమ్య మీద హైపర్ ఆది బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువైపోయానని తెలుస్తోంది.. అందుకే ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.