English | Telugu

బిగ్ బాస్ ఓటిటికి ఛాన్స్ వస్తే వెళ్తా...


బిగ్ బాస్ లోకి శోభా వెళ్ళినప్పుడు బయట ఆమె మీద చాలా నెగటివ్ ట్రోల్ల్స్ వచ్చాయి. ఐతే వాటి గురించి శోభాశెట్టి, యశ్వంత్ ఒక వీడియో చేసి ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చారు. "ఓటిటి బిగ్ బాస్ కి మళ్ళీ ఛాన్స్ వస్తే వెళ్తారా" "చూద్దాం, ఆలోచిద్దాం, వెళ్ళాలి అనుకుంటే నేను మీకు అప్ డేట్ ఇస్తాను. యశ్వంత్ కూడా నాకే ఛాన్స్ ఇచ్చాడు కదా. కాబట్టి వెళ్ళాల వద్దా అనేది నేనే డిసైడ్ చేసుకోవాలి" అని చెప్పింది. "ప్రస్తుతానికి సీరియల్స్ చేస్తున్నారా" "లేదు చేయడం లేదు. కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాక మంచి ప్రాజెక్ట్ చూసుకుని చేస్తాను" "పెళ్ళెప్పుడు" "అందరూ అదే అడుగుతున్నారు..త్వరలో చేసుకుంటాం".."మూవీస్ ఛాన్స్ వస్తే" " ఫస్ట్ నా ప్రిఫెరెన్సు సీరియల్స్ కే. నాకు ఎక్కువ పేరు వచ్చింది ఇక్కడే.

మూవీస్ లో ఛాన్స్ వస్తే మంచి రోల్స్ వస్తే చేస్తానేమో" .."బిగ్ బాస్ లో శివాజీ గారితో గొడవ పడ్డారు అందుకే ఇప్పటి వరకు ఆయనని బయట మీట్ అవ్వలేదు" "అక్కడ ఉండే పరిస్థితులని బట్టి గొడవ జరుగుతుంది అంతే." " ప్రియాంక టాప్ 5 లో ఉన్నందుకు ఆమె మీద మీరు జెలసీగా ఉన్నారు అని శివ్ గారు అన్నారు.. నిజమేనా" "తెలీదు.. ఆలోచించలేదు.. గుర్తు లేదు.. అది శివ్ గారి అభిప్రాయం..కొన్నిటికి నేను రియాక్ట్ కాలేను. "అమర్ మీ ఫ్రెండ్ షిప్ బాగుంది" "అమర్ నాకు మంచి ఫ్రెండ్..లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాడు" అని చెప్పింది. "స్పా...స్పైలో ఎవరు బెస్ట్" " హౌస్ వరకు స్పా టీమ్ ఇష్టం. బయటకు వచ్చాక నో స్పా...నో స్పై..అందరం బిగ్ బాస్ రియూనియన్ షో చేసాం. అందులో స్పా...స్పై గురించి ఇంటరెస్టింగ్ విషయం ఉంది..డెఫినిట్ గా చూడండి." అంటూ ఆన్సర్స్ చెప్పింది. బిగ్ బాస్ కి వెళ్లకపోయి ఉంటే మంచి ఛాన్స్ మిస్ చేసుకుని ఉండేదాన్ని. బిగ్ బాస్ వల్లే తాను చాలా స్ట్రాంగ్ ఐనట్టు చెప్పింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక వచ్చింది నెగటివ్ ట్రోలింగ్ ని లైట్ తీసుకున్న. అన్ని సమయాల్లో లైఫ్ ఒక్కలాగే ఉండదు కదా అని క్లారిటీ ఇచ్చింది శోభా.