English | Telugu
కొత్త కార్ కొన్న బోల్డ్ యాంకర్
Updated : Jun 19, 2024
సెలెబ్రిటీలు రోజుకో కారు కొంటు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నారు. వారిలో తాజాగా రీతు చౌదరి కూడా చేరింది. సీరియల్ నటిగా.. యాంకర్‌గా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రీతూ చౌదరి.. ఇప్పుడు గేర్ మార్చి బండిని యమా క్రేజ్ తెచ్చుకుంటోంది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోతకి పెట్టింది పేరు.. ప్రస్తుతం దావత్ అనే టాక్ షో చేస్తుంది. ఈ షోతో బోల్డ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి.. ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. తన కొత్త కారుని సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఫాలోవర్స్‌తో పంచుకుంది. మరో లగ్జరీ కార్‌ను కొన్నది. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో హాట్ టాపిక్ నిలుస్తున్న రీతూ చౌదరి.. ఖరీదైన టొయోటో హైక్రాస్ లగ్జరీ కారుని కొనేసింది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా కొంటున్న ఈ కారుని రీతు సొంతం చేసుకుంది. ఈ కారు ఖరీదు.. ప్రస్తుత మార్కెట్ ధర.. రూ.30 లక్షలు పైనే.
ఇంటిగుట్టు సీరియల్‌లో నెగెటివ్ రోల్‌లో యాక్టింగ్ చేసి అందరినీ మెప్పించింది రీతు. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్‌లో సందడి చేసిన ఫోటోస్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా కార్ తీసుకొని దానిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. అయితే రీతు చౌదరికి ఇన్ స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.