English | Telugu

గుప్పెడంత మనసులో సరికొత్త ట్విస్ట్.. ఏంజిల్ ప్రేమలో రిషి!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -862 లో.. ఏంజిల్ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్నే అని నాకు తెలిసిపోయిందని రిషితో విశ్వనాథ్ అంటాడు. నువ్వు ఏంజిల్ ని పెళ్లి చేసుకుంటే నాక్కూడా సంతోషంగా ఉంటుందని రిషితో విశ్వనాథ్ అనగానే రిషి షాక్ అవుతాడు.

ఆ తర్వాత నీకు గతంలో ప్రేమలాంటివి ఉంటే చెప్పు.. ఎందుకు ఏంజిల్ తో పెళ్లి వద్దు అంటున్నావని విశ్వనాథ్ అనగానే.. నాకు గతం లో ఎలాంటి ప్రేమ లేదు కానీ నాకు ఇలా ఉండడమే ఇష్టమని రిషి అంటాడు. నువ్వు ఆలోచించుకొని నాకు చెప్పు అని విశ్వనాథ్ అంటాడు. ఆ తర్వాత రిషి కాలేజీకి వెళ్లి విశ్వనాథ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వస్తుంది. రిషిని చూసిన వసుధార.. ఏమైందని అడుగుతుంది. రిషి విశ్వనాథ్ గురించి చెప్తాడు. మీరేదో ఒక నిర్ణయం తీసుకోండి. మీకు ఇప్పుడు ఒక తోడు కావాలి. అంత బాగా ఉండే మీ భార్య స్థానంలో నేను ఉండే దాన్ని అని వసుధార అనగానే రిషి కోప్పడతాడు.

నా గురించి చెప్పి ఈ పెళ్లి నుంచి తప్పించుకుంటారో లేక ఏంజిల్ ని పెళ్లి చేసుకుంటారో అది మీ ఇష్టమని వసుధార అనగానే.. ఆ మాట విని వసుధార పైకి రిషి చెయ్యి ఎత్తుతాడు... ఇక్కడ నుండి వెళ్ళండని వసుధారతో రిషి అంటాడు. వసుధార బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ఏంజిల్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని విశ్వనాథ్ కి చెప్పాలని తన దగ్గరికి వెళ్తాడు రిషి. విశ్వనాథ్ కి ముందుగా టాబ్లెట్స్ ఇస్తాడు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి సర్ అని రిషి వేరొక వైపు చూస్తూ తన మనసులో ఉన్నది మొత్తం చెప్తాడు. నాకు ఏంజిల్ నీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు సర్ అని చెప్పి విశ్వనాథ్ వైపు తిరుగుతాడు. విశ్వనాథ్ నిద్రపోతాడు రిషి చెప్పిందేమీ వినడు. రిషి నేను చెప్పింది ఏం వినలేదా అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం విశ్వనాథ్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటాడు. ఎలాగైనా ఏంజిల్ నీ పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్పాలని రిషి అనుకుంటాడు.. రాత్రి ఎదో చెప్పాలని అన్నావ్ రిషి ఇప్పుడు చెప్పు అని విశ్వనాథ్ అంటాడు. అప్పుడే పక్కనే ఉన్న ఏంజిల్.. ఏంటని అడుగుతుంది. నాకు మీరు చాలా హెల్ప్ చేసారు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ అని చెప్తుండగా విశ్వనాథ్ కలుగజేసుకొని.. నాకు తెలుసు రిషి నువ్వు ఒప్పుకుంటావని హ్యాపీగా ఫీల్ అవుతూ.. నీతో పెళ్లి కి రిషి ఒప్పుకున్నాడంటూ ఏంజిల్ తో విశ్వనాథ్ చెప్తాడు. ఏంజిల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి మాత్రం నేను ఒప్పుకోలేదు. నేను చెప్పేలోపే ఇలా అర్థం చేసుకున్నారని, ఏదో చెప్పేలోపు విశ్వనాథ్ కి తలతిరిగినట్టు అవుతుంది. ఈ ఏంజిల్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడు చెప్పకపోవడమే మంచిదని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.