English | Telugu
శ్రీనివాస్ అడిగే ప్రశ్నలకు షాకైన భవాని!
Updated : Sep 8, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -256 లో.. శ్రీనివాస్ తో ముకుంద తన ప్రేమ విషయం ఎలాగైనా పెద్దత్తయ్య తో చెప్పమని చెప్పి వెళ్ళిపోతుంది. మరొక వైపు కృష్ణ తల స్నానం చేసి వచ్చి వణుకుతుంటుంది. ఏంటి కృష్ణ నువ్వు చల్లటి నీళ్లతో స్నానం ఎందుకు చేసావ్? ఎందుకు వణుకుతున్నావని మురారి అడుగుతాడు. మాకు ఇది అలవాటే అని కృష్ణ సమాధానం చెప్తుంది.
ఆ తర్వాత తలతూడ్చుకుంటున్న కృష్ణ వైపు మురారి ప్రేమగా చూస్తుంటాడు. ఎంత అందంగా ఉందని చూసి మురిసిపోతాడు. మరొక వైపు ఈ రోజు వరలక్ష్మి వ్రతం అందరూ చూస్తుండగానే మురారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అందరికి నా భర్త మురారి అని తేలిసేటట్టు చెయ్యాలని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు మురారిని పిలుచుకొని రావడానికి కృష్ణ వస్తుంది. కృష్ణ తుమ్మతుంటే ఏంటీ వద్దంటే చల్లిటి నీళ్ళతో స్నానం చేసావ్. ఇప్పుడు జలుబు అయిందని మురారి అంటాడు. ఆ తర్వాత ఏవండీ అని కృష్ణ పిలుస్తుంది. అలా పిలవగానే మురారి ఆశ్చర్యంగా చూస్తాడు. అలా పిలవకూడదా అని కృష్ణ అడుగుతుంది. పిలవవచ్చు కానీ నాకే ఏదోలా ఉందని అనగానే సరే మిమ్మల్ని ఏసీపీ సర్ అనే పిలుస్తానని కృష్ణ చెప్తుంది. ఇద్దరు కలిసి పూజ దగ్గరికి వెళ్తారు. అప్పుడే ముకుందకి శ్రీనివాస్ చీర తీసుకొని వస్తాడు.. ముకుంద వెళ్లి చీర కట్టుకొని వస్తుంది. పూజ మొదలవుతుంది.ఆ తర్వాత కొద్దిసేపటికి పూజ పూర్తి అవుతుంది. అందరు వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ముకుంద కావాలనే మురారి కాలి దగ్గర చెవి కమ్మ పోగొట్టుకొని తీసుకుంటున్నట్లుగా చేసి మురారి కాళ్ళు మొక్కుతుంది. అది గమనించిన రేవతి కోపంగా చూస్తుంది.
ఆ తర్వాత రేవతి, శ్రీనివాస్ లను భవాని రమ్మని మాట్లాడుతుంది. మరొక వైపు అలేఖ్య తన తలతిక్క ప్రశ్నలతో మధుకి చిరాకు తెప్పిస్తుంది. మరొక వైపు మీరు నాకు రోజు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేయడంలో మీ ఉదేశ్యమేంటి ఆదర్శ్ గురించి ఎక్కడి వరకు వచ్చిందని అడగడమేనా మీ ఉద్దేశ్యమని శ్రీనివాస్ తో భవాని అంటుంది. ఆదర్శ్ కావాలనే ఇంటికి రావడం లేదట అని శ్రీనివాస్ అనగా.. ఆ విషయం మా కంటే ముందు మీకెలా తెలుసని భవాని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.