English | Telugu

కృష్ణ అనుకొని ముకుందను హగ్ చేసుకున్న మురారి!

'కృష్ణ ముకుంద మురారి' ఈ సీరియల్ ఇప్పుడు 59వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. విజయ్ తో పాటుగా ఇంట్లో వాళ్ళు అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. విజయ్ ప్రతీసారీ కృష్ణ, ముకుందలని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అయితే విజయ్ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మురారి జంటకు తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తాడు.

కృష్ణ, ముకుందలు ఇద్దరూ ఒకే కలర్ చీర కట్టుకోవడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ముకుంద పూలు సర్దుతుండగా వెనుక నుండి చూసి కృష్ణ అనుకొని మురారి పట్టుకుంటాడు. అటునుండి వస్తున్న రేవతి గమనించి "ఏం చేస్తున్నావ్" అని మురారిని కోప్పడుతుంది. "నేను కృష్ణ అనుకొని పట్టుకున్నాను" అని మురారి అంటాడు. "తను కృష్ణా అని పట్టుకున్నాడు. మరి నీకేమైంది నువ్వు కృష్ణవి కాదు కదా ముకుందా.. నీకు తెలుసు కదా" అని రేవతి అనడంతో "మీ ఉద్దేశ్యం ఏంటీ అత్తయ్య.. అర్ధం కావడం లేదు" అని అంటుంది. "నీ ఉద్దేశ్యమే నాకు అర్ధం కావడం లేదు" అని రేవతి చెప్తుంది. కృష్ణ నువ్వు ఇంకెప్పుడు ఈ చీర కట్టుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత గాలిపటాలు ఎగురవెయ్యడంలో కుటుంబసభ్యులంతా పోటీ పడతారు. అందులో మురారి గాలిపటంకి ఉన్న ధారం తెగిపోతుంది. పోటీలో చివరగా కృష్ణ, ముకుందలు ఉంటారు. అయితే కృష్ణకి సపోర్ట్ ఇచ్చి దగ్గర ఉండి గెలిపిస్తాడు మురారి. అది చూసి ముకుంద తట్టుకోలేదు. ఆ తర్వాత కృష్ణ ని అందంగా ముస్తాబు చేసి తీసుకొస్తూ ఉంటుంది రేవతి. ఇంట్లో వాళ్ళు అందరూ కృష్ణని ఆశ్చర్యపోతూ చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.