English | Telugu

బయట టూ లెట్ బోర్డు.. ఇంట్లో హిమతో మోనిత!

'కార్తీక దీపం' కి ఎలాంటి ముగింపు ఉంటుందోనని అందరిలో సస్పెన్సు నెలకొంది. ఇప్పుడు ఈ సీరియల్ ఎపిసోడ్ -1567 లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో.. తనని రోడ్డు మీద పడుకోబెట్టిన దీపను వదలను అంటూ కోపంతో ఊగిపోతుంది‌ మోనిత.

సౌందర్య ఇంటికి భాగ్యం వచ్చి దీప గురించి ఆరా తీసేలోపే బయట నుండి దీప వస్తుంది. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అంతలో శౌర్య అక్కడికి వచ్చి "హిమ ఎక్కడా? కనిపించడం లేదు" అని అడుగుతుంది. "ఇందాక నేను వస్తుంటే హిమ బయటికి వెళ్ళింది. నా ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసి ఎక్కడికి రావాలి అని అడిగింది" అని భాగ్యం చెప్పగా అక్కడే ఉన్న దీప తన ఫోన్ తీసుకొని నెంబర్ చెక్ చేస్తే మోనిత నెంబర్ రావడంతో.. ఒక్కసారిగా భయపడి నా కూతురిని ఆ మోనిత ఏం చేస్తుందోనని కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కాసేపటికి కార్తిక్ వస్తాడు. సౌందర్య, కార్తిక్, దీపలు కలిసి మోనిత దగ్గరకి వెళ్తారు. అయితే హిమకి వాళ్ళ నాన్న గురించి తప్పుగా చెప్తూ.. తన మాటలన్నీ వినేలా మాట్లాడుతూ ఉంటుంది మోనిత.

మోనిత ఇంటికి వెళ్లేసరికి.. అక్కడ బయట తాళం వేసి టూ-లెట్ బోర్డ్ ఉంటుంది. అయితే హిమ, మోనిత ఇద్దరు లోపలే ఉంటారు. బయట తాళం వేసి ఉండటం చూసి హిమని మోనిత ఎక్కడికో తీసుకెళ్ళిందని దీప కన్నీటి పర్యంతం అవుతుంది. దీపని ఓదార్చుతాడు కార్తిక్. "హిమని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అంతే కానీ హిమను ఏం చెయ్యదు" అని కార్తీక్ అంటాడు. ఆ మాటలను శౌర్య వింటుంది. "మోనిత దగ్గర హిమ ఉందా? ఈ హిమ ఎప్పుడు ఇంతే ఎవరు చెప్పింది వినదు" అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.