English | Telugu

రిషితో పాటు గెస్ట్ హౌస్ లో వసుధార!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ -665 లోకి అడుగు పెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో వసుధార అమ్మనాన్నలు తనకి ఫోన్ చేసి తన బాగోగులు కనుక్కుంటారు. "నువ్వు ఏం బాధపడకు అమ్మా.. నరకాసురుడి నుండి మనకు విముక్తి అయింది. ఇక మనకు ఏం ఇబ్బందులు లేవు" అంటూ సంతోషంతో చక్రపాణి అంటాడు. వసుధార తన నాన్న లో వచ్చిన మార్పుకు సంతోషపడుతుంది.

మరో వైపు 'రిషిధార' లు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. వసుధార గురించి ఆలోచిస్తూ రిషి.. "అసలు వసుధర మనసులో ఏముంది. వేరొకరికి భార్య అయి ఉండి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది?. తను నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్నగా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయింది" అని అనుకుంటాడు. మరోవైపు రిషి గురించి వసుధార ఆలోచిస్తూ.. "మిమ్మల్ని ఎప్పుడు వదులుకోను సర్.. మీరు నాకు జీవితంలో దొరికిన అరుదైన బహుమతి" అంటూ భావోద్వేగానికి లోనవుతుంది.

మరుసటి రోజు వసుధార కాలేజీకి వెళ్లి రిషి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా రిషి రాకపోయే సరికి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చెయ్యడు. అలాగే జగతి, మహేంద్రలకు చేస్తుంది. ఎవరూ కూడా వసుధార ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ధరణికి ఫోన్ చేస్తుంది. అప్పుడు రిషి సార్ ఇంటికి రాలేదు అనే విషయం తెలుసుకుంటుంది. ఇంటి దగ్గర, కాలేజీ దగ్గర లేడంటే గెస్ట్ హౌస్ లో ఉంటాడని భావించి అక్కడికి వెళ్తుంది.

గెస్ట్ హౌస్ లో రిషిని చూసిన వసుధార "మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు సర్" అని అడుగుతుంది. "అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్" అని రిషి అంటాడు. వసుధార బాధపడుతుంది. "రిషి సర్ ఇంటికి వెళ్ళండి" అని చెప్తుంది. అయినా వినకపోయేసరికి "మీ రిషి కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నాడు" అని మహేంద్రకి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. దాంతో ఇంట్లోవాళ్ళకి రిషి గెస్ట్ హౌస్ లో ఉన్న విషయం, రిషీతో పాటుగా వసుధార కూడా అక్కడే ఉన్న విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.