English | Telugu

నా సక్సెస్ ని ఎంజాయ్ చేసేది శివజ్యోతి.. 'మరేం చేద్దాం' మూవీతో త్వరలో..

'విరూపాక్ష' మూవీలో రవికృష్ణ క్యారెక్టర్ బాగా హిట్ అయ్యేసరికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు రవికృష్ణ. తాజాగా ఓ ఇంటర్వూలో విరూపాక్ష సక్సెస్, శివజ్యోతితో బాండింగ్ ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. "బిగ్ బాస్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత విరూపాక్ష మూవీ కూడా మంచి సక్సెస్ ని ఇచ్చింది. ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు నాకో బ్రేక్ వచ్చిందని అనుకుంటున్నా. ఎలా ఐతే మొగలి రేకులు సీరియల్ లో లవర్ బాయ్ గా మంచి స్టార్ట్ దొరికిందో విరూపాక్ష మూవీలో కూడా నాకు అలాగే మంచి స్టార్ట్ దొరికింది అనుకుంటున్నా. 'మరేం చేద్దాం' అనే మూవీ రాబోతోంది అందులో నేను లీడ్ రోల్ లో నటించాను. ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి చేశాను. తర్వాత నరేష్ గారితో ఒక మూవీ..ఇవి కాకుండా ఇంకో రెండు సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి" అని చెప్పాడు.

"బిగ్ బాస్ తర్వాత రవికృష్ణ బ్రేక్ తీసుకున్నాడు అప్పుడప్పుడు సావిత్రి యుట్యూబ్ ఛానల్ కనిపిస్తున్నాడు..ఏం చేస్తున్నారు అంటే దానికి రెస్పాన్స్ ఉండదు..అసలు ఏం చేస్తున్నారు " అనేసరికి.. "మా జ్యోతమ్మ మాములుగా ఉండదుగా..అరే నానీగా..ఏంట్రా ఆ యాక్షన్..ఎలా చేసావురా అని అడిగింది. మా పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీలవుతారో శివజ్యోతి కూడా అంతే హ్యాపీగా ఫీలవుతుంది. నేను లైఫ్ లో కొంచెం అచీవ్ చేసినా చాలా హార్ట్ ఫుల్ గా నా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. మన ఓన్ సిస్టర్ ని ఎన్నాళ్ళ తర్వాత కలిసినా ఆ బాండింగ్ ఎలా ఉంటుందో మా మధ్య కూడా రిలేషన్ అలాగే ఉంటుంది. నా మంచి కోరుకునే పర్సన్స్ లో శివజ్యోతి ఫస్ట్ ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.

"నా మూవీ ఫస్ట్ టైం థియేటర్ లో చూసినప్పుడు అందులోనూ నా రోల్ వచ్చినప్పుడు ఆడియన్స్ పేపర్ లు చింపి వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అదే ఈ మూడేళ్లు ఆడియన్స్ కి దూరంగా ఉండటానికి కారణం...నేను ఏం చేస్తున్నానో కూడా రివీల్ చేయలేని పరిస్థితికి నేను బాధపడ్డాను. సీరియల్స్ చేస్తున్నావ్ కదా మంచిగా అవి ఆపేసి ఇలా మూవీస్ లోకి రావడం ఎందుకు అని ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు...అప్పుడు కొంచెం బాధపడ్డాను" అని చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.