English | Telugu
సీరియల్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే....?
Updated : May 11, 2023
బుల్లితెర మీద దుర్గ గద్దె వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు ఆమె బుల్లితెర సీరియల్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. కానీ ఎందుకు తప్పుకుంది.. కారణమేంటి అంటూ చాలామంది అడుగుతుండేసరికి ఆ విషయాల గురించి ఒక వీడియోలో తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది " నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ముందు సినిమాల వైపు వెళ్లాను. నేను నటించిన ఫస్ట్ మూవీ అల్లరే అల్లరి. బుల్లితెర మీద నటించిన ఫస్ట్ సీరియల్ అపరంజి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాక నేను డబ్బింగ్ కార్డు, ఆర్టిస్ట్ కార్డు కూడా సంపాదించుకున్నాను. ఒక పక్కన చదువుకుంటూనే మరో వైపు వచ్చిన సీరియల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. నా లాస్ట్ ప్రాజెక్ట్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, బంగారు పంజరం.
నేను బి.కామ్ కంప్యూటర్స్ చేసాను..తర్వాత ఎం.కామ్ మాస్టర్స్ కూడా చేసాను. ఎం.కామ్ చదివే టైంకి సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ చేస్తున్నాను. ఆ టైములో నా మాస్టర్స్ పూర్తయ్యేసరికి ఈ సీరియల్ లో జనరేషన్ చేంజ్ అన్నారు. ఇదంతా లాక్ డౌన్ టైంలో జరిగింది...నా ఎడ్యుకేషన్ పూర్తవగానే కాలేజీ నుంచి ప్లేసెమెంట్స్ కూడా వచ్చాయి. ఐతే నా ఫ్రెండ్ తాను చేసే చోట జాబ్ ఆఫర్ ఉంటే నన్ను రిఫర్ చేసింది. అలా అక్కడ అన్ని రౌండ్స్ కి అటెండ్ అయ్యాను. ఫైనల్లీ నేను ఆ జాబ్ రోల్ కి సెలెక్ట్ అయ్యాను. అలా ప్రస్తుతం యాక్సెంచర్ లో జాబ్ చేస్తున్నా. అలాగే మరో వైపు సీరియల్స్ లో వచ్చే రోల్స్ ని ఎంచుకుని చేసుకుంటూ వెళ్తున్నా..రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కూడా చేసాను. ప్రస్తుతం అది ప్రాసెసింగ్ లో ఉంది. అలా నేను రెండూ మేనేజ్ చేస్తూ వస్తున్నాను. సీరియల్స్ లో మంచి రోల్ కోసం వెయిట్ చేస్తూ కొంచెం బ్రేక్ తీసుకున్నా అంతే కానీ సీరియల్స్ అస్సలు మానేయను" అని చెప్పింది దుర్గ.