English | Telugu
నేను తెలుగు షోస్ చేస్తున్నాను..నాకూ తెలుగొచ్చు..పండగ చేస్కో అంటూ తెలుగులో రష్మీ కౌంటర్
Updated : Aug 27, 2022
బుల్లి తెర మీద రష్మీ చేసే కామెడీ మాములుగా ఉండదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ వారానికి మూడు రోజులు ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది రష్మీ. రష్మీ యాంకర్ మాత్రమే అనుకుంటే పొరపాటు..భూతదయ కలిగిన అమ్మాయి కూడా. ఏ మూగ జీవి ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కావాల్సిన సాయం అందేలా చేస్తుంది. కొన్ని మూవీస్ లో నటించింది రష్మీ. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా ఒక నెటిజన్ రష్మీ మీద కావాలని సెటైర్ వేశాడో లేదా మనసులో నిజంగా పాజిటివ్ థాట్ తో కామెంట్ పెట్టాడో తెలీదు కానీ రష్మీ కూడా అలాగే స్పందించింది.
రష్మీ ట్విట్టర్ అకౌంట్ చూస్తే గనక సంజు కపూర్ అనే వ్యక్తి " నీతో అసలు గొడవే లేదు. ఎవరు ఏమన్నా పట్టించుకోవు. అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు. అసలు నీకు తెలుగే అర్ధం కాదు" అంటూ ఒక సెటైర్ కామెంట్ పోస్ట్ చేసాడు. దీనికి రష్మీ వెంటనే స్పందించింది. నేను తెలుగు షోస్ చేస్తున్నాను..నాకూ తెలుగొచ్చు అన్న రీతిలో "పండగ చేస్కో" అంటూ రిప్లై ఇచ్చిపడేసింది. ఇప్పుడు ఈమె ఇచ్చిన కౌంటర్ ఎటాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీ ఎప్పుడూ నవ్వుతూ వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. కానీ జంతువులను హింసించే వారిపై చాలా సీరియస్ ఐపోతుంది.