English | Telugu

బ్రూనోను కిరాత‌కంగా చంప‌డంపై యాంకర్ రష్మి ఎమోషనల్ పోస్ట్!

యాంకర్ రష్మీ గౌత‌మ్‌ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు పలు విషయాలపై ఆమె స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మూగజీవాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటుంది. మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె ఎన్నో మంచి పనులు చేసింది కూడా. ఈ క్రమంలో త‌ను ట్రోలింగ్‌కు గుర‌వుతున్నా ఏమాత్రం ప‌ట్టించుకోదు. పండగల్లో జంతు బలి ఇవ్వడాన్ని తప్పుబడుతూ రష్మీ చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు.

అయితే రష్మీ మాత్రం అసలు రాజీ పడదు. హిందూ సంప్రదాయాన్నే కాదు.. మూగజీవాలకు హాని కలిగించే ప్రతి అంశాన్నీ ఆమె వేలెత్తి చూపుతుంటుంది. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు అనే తేడా లేకుండా అన్నింటి గురించి ఆలోచిస్తుంటుంది. వీధి కుక్కలపై జరిగే దాడిని ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది.ఇటీవ‌ల‌ ఓ బీచ్‌లో బ్రూనో అనే కుక్కను ముగ్గురు కలిసి కిరాతకంగా చంపేశారు. కర్రలతో బాది ఆ తరువాత చేపల గాలానికి వేలాడదీసి చంపేశారు.

ఈ భయంకరమైన ఘటన అందరినీ కుదిపేసింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన రష్మీ.. మనుషులు, మానవత్వం అనే దానిపై సిగ్గేస్తోంద‌ని.. కరోనా లాంటివి రావడం సమంజసమే అనిపిస్తోందని కామెంట్స్ చేసింది. బ్రూనో హంతకుల‌నుఉద్దేశిస్తూ.. "అది మీకేం అన్యాయం చేసింది.. అదేం పాపం చేసిందని దాన్ని అలా చంపారు? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ర‌ష్మి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.