English | Telugu

వంటలక్క కాదు ఫొటోల‌క్క‌.. నిరుపమ్ సెటైర్లు!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సీరియల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీరియల్‌లో నటించే తారలంతా ప్రేక్షకులు దగ్గరయ్యారు. సోష‌ల్ మీడియాలో 'కార్తీకదీపం' సీరియల్ హల్చల్ చేస్తుంటుంది. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ తన నటనతో మెప్పిస్తుంటే.. వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ ఓ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తోంది.

ఈ జంట ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిరుపమ్ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. తనదైన స్టైల్‌లో సెటైర్లు, పంచ్‌లు వేస్తూ అలరిస్తుంటారు. తన మీద, 'కార్తీకదీపం' సీరియల్ మీద వచ్చే మీమ్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా నిరుపమ్ తన ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

ఆదివారం అయితే మాములుగా అందరూ ఇంటిపట్టునే ఉంటారు. షూటింగ్‌లు ఏవీ పెద్దగా ఉండవు. కానీ 'కార్తీకదీపం' యూనిట్ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుందట. ఆదివారం కూడా షూటింగ్ పెట్టడంతో కోపంగా ఉన్నానని చెప్పిన నిరుపమ్.. వంటలక్క మాత్రం ఫోటోలు తీస్తూ.. ఫొటోలక్కగా మారుతుందేమో అని కౌంటర్ వేశారు. వంటలక్క తీసిన ఫోటోలో నిరుపమ్ బుంగమూతి పెట్టుకొని కనిపించారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.