English | Telugu

అమర్ రహే టు థౌజండ్ నోట్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల రూపాయల నోటుపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023 సెప్టెంబర్ 30 తేదీ వరకే రూ. 2 వేల నోటు చెల్లుతుందని, ఆ లోపే తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2 వేల రూపాయల నోటు చెల్లదు అని ప్రకటించింది. ఈ నోటు ఇక కనిపించదు అనే కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఈ వారం ఒక వెరైటీ స్కిట్ ని ప్రెజంట్ చేశారు రాంప్రసాద్ అండ్ టీమ్...రాంప్రసాద్ 500 ల నోటులా, మహేష్ ఆచంట 2 వేల నోటులా, సన్నీ వెయ్యి రూపాయల నోటులా కాస్ట్యూమ్స్ వేసుకుని ఈ స్కిట్ చేశారు. ఆఫ్ట్రాల్ రెండు వేల రూపాయలు అని కొంతమంది కమెడియన్స్ అనడంతో దాని గురించి చాలా గొప్పగా చెప్పాడు మహేష్. "అరె అన్నయ్య నువ్వు త్వరలో వెళ్ళిపోతున్నావ్ కదా..

బాన్ చేసేస్తున్నారన్న భయం లేదా నీకు " అని అడిగాడు రాంప్రసాద్. "ప్రతిక్షణం భయపడుతూనే ఉంటాను సర్. నన్ను తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టినప్పుడు బ్యాంకుల్లో జనాలు క్యూలో ఉండాలి, వాళ్ళ చేతుల్లో 2 వేల రూపాయల నోటు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి..కుదిరితే ఈ డైలాగ్ ఎడిటింగ్ లో ఉండాలి సర్ అమర్ రహే టు థౌజండ్ నోట్" అని వీరలెవెల్ లో డైలాగ్ చెప్పాడు మహేష్. "బాధపడొద్దు అన్నయ్య. త్వరలో నువ్వు వేరే రూపంలో పుడతావ్ నాకు తెలుసు. డబ్బుకు వేల్యూ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు నాకు తెల్సు" అని చెప్పాడు రాంప్రసాద్...ఇక జడ్జి ఖుష్బూ ప్రధాని మోడీ రేంజ్ లో ఈ రోజు రాత్రి నుంచి 2 వేల నోటు చెల్లదు అని అనౌన్స్ చేసేసరికి మహేష్ కింద పడిపోయాడు. "వెయ్యి, రెండు వేల నోట్లు వెళ్లిపోయాయి ఇక రాజ్యం మొత్తం మనదే" అని 500 రూపాయల నోటు డైలాగ్ చెప్పినట్టు చెప్పాడు రాంప్రసాద్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.