English | Telugu
అల్లు అర్జున్ తో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేయాలనుంది
Updated : Sep 11, 2022
బుల్లితెర సీరియల్స్ ని ఫాలో అయ్యవాళ్లకు వసుధార గురించి పెద్ద చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ పేరు ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫుల్ ఫేమస్. ఐతే వసుధార తన లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేసేసింది. మరి ఎవరో తెలుసా ....
"నా ఫస్ట్ క్రష్ వాళ్ళే.. యష్, కార్తికేయ, విజయ్ దేవరకొండ. వీళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం. కన్నడలో నేను ఒక మూవీ చేస్తున్నప్పుడు నాకు గుప్పెడంత మనసు సీరియల్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. ఆ టైములో అనుకోకుండా ఓకే చెప్పేసాను. ఇక సీరియల్ విషయానికి వస్తే మాత్రం వర్షంలోనే వశుధార, రిషి సర్ కలుస్తారు. ఎందుకంటే వర్షం అనేది ఒక డిఫరెంట్ వైబ్..రొమాంటిక్ ఫీలింగ్ ఇస్తుంది. ఇక రిషి సర్ కి వసుధారకు అసలు రొమాన్స్ అంటే ఏమిటో తెలీదు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్లినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన ఆడియన్స్ నా సీరియల్ చూస్తున్నామని చెప్తారు. తర్వాత వెంటనే ఎందుకు రిషి సర్ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు..పాపం కదా రిషి సర్ అని అడుగుతారు. ఇక మా ఫొటోస్ అన్ని కలిపి ఫ్యాన్ పేజెస్ రన్ చేస్తుంటారు చాలా మంది. వాళ్లకు, నా సీరియల్ చూసే అందరికీ ధన్యవాదాలు. ఎక్కడైనాసరే నా బుర్ర ఎవరూ తినరు ఎందుకంటే నేనే అందరి బుర్ర తింటుంటాను కాబట్టి. అలాగే నేను డబ్బుల్ని ఎక్కువగా తినడానికి, షాపింగ్ కి ఖర్చు చేస్తుంటాను. ఐతే నా జీవితంలో ఇప్పటివరకు లేదు అనే ఫీల్ అయ్యింది బార్బీ డాల్ విషయంలో. బార్బీ డాల్ సెట్ ఇప్పటికీ నా దగ్గర లేదు...ఎన్ని సార్లు కొనడానికి ట్రై చేసినా అది మాత్రం తీసుకోలేకపోయాను. ఇక నేను ఒక రొమాంటిక్ సాంగ్ చేయాల్సి వస్తే అల్లు అర్జున్ తో చేస్తాను.. ఎందుకంటే నాకు ఆయన డాన్స్ బాగా నచ్చుతుంది." అంటూ వసుధార అలియాస్ రక్షా గౌడ ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు తన ఫాన్స్ తో షేర్ చేసుకుంది.