English | Telugu

రక్ష గౌడ వెకేషన్ ఫోటోలు.. గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి షాక్!

అందమైన చందనాల బొమ్మరా అని పాడాలనిపచేలా గుప్పెడంత మనసు సీరియల్ లో కన్పించిన వసుధార అలియాస్ రక్ష గౌడ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలని షేర్ చేసింది.

ఆ ఫోటోలని‌ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చూస్తే షాక్ అవుతారు. ట్రెండీ లుక్ లో‌ పొట్టి బట్టల్లో ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ భామ‌‌. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి జోడీగా రిషీధాలుగా కలిసి ఉన్నారు ‌ వీరిద్దరి జోడికి ఇన్ స్టాగ్రామ్ లో‌ బోలెడంత ఫ్యాన్స్ ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి జోడి ఎంత పెద్ద హిట్టో ఆ సీరియల్ టీఆర్పీ చూస్తే తెలుస్తుంది.

రక్ష తాజాగా మలేషియా వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ రక్ష అక్కడి ఫొటోలు పంచుకుంది. ఇందులో చిన్న డ్రెస్ లో కనువిందు చేసింది. అయితే కొందరు భలే క్యూట్‌గా ఉందనగా.. మరికొందరు ఇలాంటివి పోస్ట్ చేయకండి అంటు కామెంట్లు పెడుతున్నారు. ఇక రిషి, వసుధారల కాంబినేషన్ లో‌ మరో సీరియల్ కావాంటే ' గుప్పెడంత మనసు' సీరియల్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.