English | Telugu

తాతయ్య మనవడిగా రాజ్‌‌ లో మార్పు.. కావ్య షాక్!

తాతయ్య మనవడిగా రాజ్‌‌ లో మార్పు.. కావ్య షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -195 లో.... కావ్య రాజ్ కి క్యారియర్ పట్టుకొని  ఆఫీస్ కి వెళ్తుంది.. మరొక వైపు రాజ్ ఆఫీస్ లో ఎంప్లాయ్ పై కోపంగా ఉంటాడు. రాంగ్ టైం లో వచ్చానా అని కావ్య అనుకుంటుంది. కావ్య రాజ్ దగ్గరికి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తుంది. తినండని కావ్య చెప్పగానే.. నేను బిజీ గా ఉన్నానని రాజ్ అంటాడు. 

ఆ తర్వాత మీరు తిన్నాకే రమ్మని తాతయ్య గారు చెప్పారని కావ్య  అంటుంది. ప్రతి దానికి తాతయ్య పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని రాజ్ కోపంగా బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళమని అంటాడు. కావ్య బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ విషయం వెళ్లి తాతయ్యకి చెప్తుందని అలోచించి వెంటనే కావ్య వెనకాలే రాజ్ వచ్చి.. నేను తినేస్తా నువ్వు తాతయ్యకి తినేసా అని చెప్పమని అంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని రాజ్ అడుగుతాడు. మా ఇంటికి వెళ్తున్నాని కావ్య చెప్తుంది. మీ అమ్మా నాన్నని అడిగినట్టు చెప్పు.. అయిన నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తావని డ్రైవర్  ని పిలిచి కావ్యని తన పుట్టింట్లో డ్రాప్ చెయ్యమని చెప్తాడు. అదంతా చూస్తున్న కావ్య ఏమైంది ఇలా చేస్తున్నారు? మీరు మీరేనా అని కావ్య అడుగుతుంది. నేను తాతయ్య మనవడిని అని రాజ్ అంటాడు. మరొక వైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. అప్పటికే కళ్యాణ్ పై అప్పు కోపంగా ఉంటుంది. ఎన్ని సార్లు ఇలా వదిలేసి వెళ్తావని అప్పు అనగానే.. నేను ఎప్పుడు ఇలా వదిలేసి వెళ్ళను. సారీ అని కళ్యాణ్ చెప్తాడు.

నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ వి అప్పు అని కళ్యాణ్ కూల్ చేసి వెళ్తాడు. అదంతా చూస్తున్న అన్నపూర్ణ.. అప్పు దగ్గరికి వచ్చి ఎందుకు అలా అబ్బాయిని కోప్పడతున్నావని అడుగుతుంది. దాంతో అప్పు కాస్త మెతకగా మాట్లాడుతుంది. ఇలా అప్పు మాటల్లో మార్పు వచ్చిందని అన్నపూర్ణకి అర్థం అవుతుంది.

మరొక వైపు కావ్య విగ్రహాలకి కలర్స్ వేస్తుంటే కనకం టీ తీసుకొని వస్తుంది. ఈ కాంట్రాక్ట్ అయిపోతే, డబ్బులు వస్తే ఆ సేటుకి ఇస్తే మన అప్పు తిరిపోతుందని కనకం కృష్ణమూర్తి, కావ్య మాట్లాడుకుంటారు. ఆ తర్వాత స్వప్న , రాహుల్ లు హానీమున్ కీ వెళ్లిన విషయం కావ్య చెప్పగానే..  స్వప్నని కనకం తిడుతుంది. మరొక వైపు రాజ్ ఆఫీస్ నుండి వచ్చి సీతరామయ్యతో మాట్లాడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.