English | Telugu

అంతగా డిలీట్ చేయాల్సి వస్తే తరుణ్ భాస్కర్ నంబర్ డిలీట్ చేస్తాను

సుమ అడ్డా షో ప్రతీ వారం ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం కూడా మంచి కలర్ ఫుల్ గా ఈ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బలగం మూవీ టీమ్ వచ్చింది. కావ్య, ప్రియదర్శి, వేణు, రచ్చ రవి వచ్చారు. వీళ్లందరినీ కూర్చోబెట్టి సుమ కొన్ని ప్రశ్నలు అడిగింది.." మీ మొబైల్ లో పెర్మనెంట్ గా ఒక నంబర్ డిలీట్ చేసెయ్యాలి అంటే మీరు ఎవరి నంబర్ ని డిలీట్ చేసేస్తారు..తరుణ్ భాస్కర్, వేణు ..వీళ్లల్లో ఎవరు ?" అని ప్రియదర్శిని అడిగింది. తరుణ్ భాస్కర్ నంబర్ ని డిలీట్ చేసేస్తాను అని చెప్పాడు. ఆ మాటతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాకయ్యారు.

"వేణు గారు మీరు ఈ వేదిక మీదనే వేణు వండర్స్ గా వచ్చారు. ఇప్పుడు వండర్ఫుల్ వేణు డైరెక్టర్ గా వచ్చారు. ఎలా అనిపిస్తోంది" అని సుమ అడిగేసరికి "జబర్దస్త్ అనే స్టేజి మాతోనే స్టార్ట్ అయ్యింది. అక్కడ మేము చేసి పది నిమిషాల స్కిట్ కూడా చిన్నపాటి డైరెక్షన్ లాంటిదే...ఈరోజు ఈ మూవీని ఇంత కంఫర్టబుల్ గా చేసాను అంటే దానికి జబర్దస్త్ స్కిట్స్ కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. బలగం అనే చిన్న సినిమా ఇంత రీచ్ అయ్యిందంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు." అని చెప్పాడు. ఇక ఈ షోలో ప్రియదర్శికి ఎమోషన్స్ చేసే టాస్క్ ఇచ్చింది సుమ. వేణుకి కమెడియన్ గా మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే వేణు ‘జబర్దస్త్’ లో టీమ్ లీడర్ గా చేసేటప్పుడు చాలామంది కమెడియన్స్ ను పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేసి ‘బలగం’ అనే మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.