English | Telugu

అత్తతో అల్లుడి డ్యాన్స్ మాములుగా లేదు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజురోజుకి అత్యంత వీక్షకాధరణ పొందతూ వస్తోంది. ఈ సీరియల్ మొదలు అయిన కొద్దికాలంలోనే టీఆర్పీలో నెంబర్ వన్ ప్లేస్ కి చేరుకుంది. సీరియల్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. విభిన్న కథతో, క్యారెక్టర్లని పరిచయం చేసిన విధానం వారి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్రహ్మమూడి సీరియల్ లో రాజ్ కావ్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావ్య అలియాస్ దీపక రంగరాజు తెలుగు అమ్మాయి కాకపోయిన తన అందంతో, సంప్రదాయానికి ప్రతీకలా చీరకట్టులో తెలుగింటి అమ్మాయిలా ఇప్పటికే ప్రేక్షకులకు దగ్గర అయింది.

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ అలియాస్ మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలోకి వెళ్ళొచ్చాక మంచి క్రేజ్ లో ఉన్నాడు మానస్.‌ఒకవైపు సీరియల్, మరొకవైపు ప్రైవేట్ అల్బమ్స్ తో బిజీగా ఉంటున్నాడు మానస్. ఇక బ్రహ్మముడి సీరియల్ కావ్యని రాజ్ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని రాజ్-కావ్య ఎప్పటికప్పుడు గొడవ పడుతూనే ఉంటారు రాజ్, కావ్యలు.. నీప అలియాస్ కనకం ఒక పేదింటి తల్లి పాత్ర లో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది... తన కూతుళ్లు ను గోపింటి కి కోడళ్ళు చేయాలనే ఒక న్యాయమైన స్వార్థం తో కనకం యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు.‌‌ కావ్యని రాజ్ భార్య కావడం దుగ్గిరాల ఇంటికి కోడలు అవ్వడంతో కనకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ లతో కథనo ముందుకు సాగుతుంది.

తాజాగా బ్రహ్మముడి టీంలోని కావ్య,‌ రాజ్, అపర్ణ ,‌ఇందిరాదేవి..‌ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో' లో పాల్గొన్నారు.. అత్తా అల్లుడు అయినా రాజ్ కనకం ఇద్దరు కలసి.. సింహాద్రి సినిమాలోని 'చిన్నదమ్మె చీక్కులు కావాలా' అని సాంగ్ కి అత్త కనకం(నీపా), అల్లుడు రాజ్(మానస్) కలిసి చేసిన డాన్స్ అదిరిపోయింది.‌ ఆ తర్వాత కావ్య, కనకం, రాజ్ ముగ్గురు కలిసి.. 'అత్తో అత్తమ్మ కూతురో' సాంగ్ కలిసి చిందులు వేశారు. దానికి సంబంధించిన వీడియోని తమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అత్తతో అల్లుడు డ్యాన్స్ ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.