English | Telugu
బి ది చేంజ్ అంటూ పిల్లలకు పాఠాలు చెప్పిన వితిక
Updated : Jul 13, 2023
వరుణ్ సందేశ్ భార్య వితిక శేరు గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు. బిగ్ బాస్ బ్యూటీగా, ఒక యాక్టర్ గా మాత్రమే కాదు ఈమధ్య తన అదరగొట్టే ఫిట్ నెస్ వీడియోస్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకుంటోంది. కండలు తిరిగిన బాడీతో టోటల్ గా చాలా చేంజ్ అయ్యింది ఈ అమ్మడు. అలాంటి వితిక ఇప్పుడు టీచర్ లా మారిపోయింది. వితిక తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో చక్కగా చీర కట్టుకుని పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. క్లాస్ లోకి వితిక ఎంట్రీ ఇస్తూనే "నా పేరు ఏంటి చెప్పండి..అనేసరికి పిల్లలంతా ఆమె పేరు చెప్పారు. ఐతే మీకు ముందే చెప్పారా నేను వస్తున్నానని..అని అడిగింది. లేదు టీచర్ అని చెప్పారు పిల్లలు. ఐతే మీరంతా ఫుల్ ఎక్సయిట్ అవుతున్నారా అని అడిగేసరికి ఎస్ టీచర్ అన్నారు... ఎంత బాగా నవ్వుతున్నారో అని పిల్లలకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది వితికా.. తర్వాత క్లాస్ స్టార్ట్ చేసింది.
పొద్దున్నే లేవగానే మనం చేయాల్సిన కొన్ని పనులు ఏమిటి అంటే ఐయామ్ ద బెస్ట్, ఐయామ్ స్ట్రాంగ్.. నేను ఏదైనా చేయగలను.. నేను ఏదైనా సాధించగలను , నన్ను నేను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా.. నా లైఫ్‌కి నేనే రాణిని...నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటా..అందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. ఇలా చేస్తామని నాకు ప్రామిస్ చేయండి.." అని పిల్లలకు చెప్పాకా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. " మీరు కూడా ఇలానే మీ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో మార్పు తీసుకురావాలనుకుంటున్నారా.. ఈరోజు నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్పడానికి మణికొండలోని గవర్నమెంట్ స్కూల్‌కి వచ్చాను.. మీరు కూడా మీకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు.. దానికి సంబంధించిన అప్లికేషన్లు ఓపెన్ అయ్యాయి.. బీ ద ఛేంజ్.." అంటూ అప్లికేషన్స్ దొరికే లింక్ అడ్రస్ కూడా చెప్పేసింది వితిక. ఈ వీడియో చూసిన తన ఫ్యాన్స్, నెటిజన్స్ వితికాను పొగిడేస్తున్నారు. వితిక అంటే ఫిట్ నెస్ తో అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఇప్పుడు బీ ది చేంజ్ అంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తోంది. నెటిజన్స్ వితిక చేసిన పనికి ఫుల్ ఖుషీ ఐపోయి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.