English | Telugu

అప్పుడేదో కోపం వచ్చి ఆమె మీద మాటలు జారాయి!

బండ్ల గణేష్ అంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్..సినిమా ఈవెంట్స్ లో ఆయన ఇచ్చే స్పీచ్ లు ఒక రేంజ్ లో ఉంటాయి. కొంత కాలం క్రితం డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద చేసిన కామెంట్స్ ఎంత హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మంత్రి రోజా మీద ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"రోజా గారిది కేసు కంప్లీట్ అయ్యిందా" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ మాట్లాడుతూ " ఏం కేసు అండి అది..ఆమె నా మీద కేసు పెడతాను అన్నారు కానీ పెట్టలేదు..ఏదో ఆ రోజు అలా ఐపోయింది..వదిలేయండి.. ఐనా మనం గర్వపడాలి ఆమెను చూసి..ఒక హీరోయిన్, ఒక ఆర్టిస్ట్.. ఒక అమ్మాయి సినిమాలు తీసింది, కష్టపడింది, కాళ్ళు, చేతులు విరగ్గొట్టుకుంది..జబర్దస్త్ లో ప్రోగ్రామ్స్ చేసింది.. ఓడిపోయి గెలిచి మంత్రి అయ్యింది..అలాంటి రోజాను చూసి మనం గర్వపడాలి. ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి..ఇప్పుడు మంత్రిగా చింపి చాటేస్తోంది..మంచికి మంచి చెప్పుకోవాలి. గొడవైనప్పుడు అయ్యింది.

తర్వాత ఎన్నో సార్లు కలిసాం, ఎన్నో ఫొటోస్ దిగాం , ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. రోజు నా సోదరి..రోజా వాళ్ళ బ్రదర్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్స్..అప్పుడేదో నాకు కోపం వచ్చింది. ఆ టైములో అలా కొన్ని మాటలు జారాయి..తప్పు జరిగిపోయింది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చూస్తుంటా. తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ రోజాలా ఐన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా..లేరు కదా అందుకే రోజాని చూసి మనమంతా గర్వపడాలి" అన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.