English | Telugu

తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ పెట్టిన పూర్ణ

బుల్లితెరని ఫాలో అయ్యే ఆడియన్స్‌కి పూర్ణ బాగా తెలుసు.. ఆమె అటు మూవీస్ లోనూ, ఇటు స్మాల్ స్క్రీన్ మీద కూడా మంచి పేరు తెచ్చుకుంది. పూర్ణ రీసెంట్‌గా పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయింది. తన ఎంగేజ్మెంట్ ఐన దగ్గర నుంచి ప్రతీ విషయం కూడా పూర్ణ తన ఫాన్స్ తో షేర్ చేసుకునేది. ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అలాంటి పూర్ణ రీసెంట్‌గా ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది. "నేను తల్లిని కాబోతున్నాను.. మా అమ్మానాన్నలు అమ్మమ్మ, తాతయ్యకాబోతున్నారు" అంటూ హ్యాపీగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంది.

ఇక ఈ న్యూస్‌ని తన బంధువులతో చెప్పింది. ఇక అందరూ ఆమెకు విషెస్ చెప్పి స్వీట్స్ పెట్టారు. ఆమెతో కేక్ కూడా కోయించి అందరూ కలిసి తినిపించారు. మలయాళ కుట్టి ఐన పూర్ణ 'శ్రీ మహాలక్ష్మి'అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'అవును'సిరీస్ చేసి ఆడియన్స్ మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత ఎన్నో మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది. కొన్ని డిఫరెంట్ రోల్స్ లో కూడా నటించింది పూర్ణ.

అలాగే బుల్లితెర మీద 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోస్‌లో ఆమె జడ్జిగా సందడి చేసింది. నిన్న మొన్నటి వరకు కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న పూర్ణ ఆల్రెడీ సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు పెళ్లి జీవితాన్ని, అలాగే తల్లి కాబోతున్న క్షణాలను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దుబాయి బిజినెస్‌మేన్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది పూర్ణ. ఇప్పుడు ఆమె చెప్పిన ఈ గుడ్ న్యూస్‌కి తన ఫాన్స్, నెటిజన్స్ అంతా కూడా ఆమెకు విషెస్ మెసేజెస్ పెడుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.