English | Telugu

అలా సిగ్గుపడితే ఎలా.. రాజమౌళి ఇదే నేర్పించాడా?

ఆహా వేదికగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సెకండ్ సీజన్ లో.. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్‌ కి ప్రభాస్ వచ్చాడు. నిన్న మొన్నటి దాకా ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడటం..దాని వల్ల ఆహా యాప్ కొన్ని గంటల పాటు నిలిచిపోవడమనేది అందరికి తెలిసిన విషయమే. అయితే నిన్న మళ్ళీ మొదలైన ఈ స్పెషల్ ఎపిసోడ్.. ఆహాలో ఇప్పటివరకు జరిగిన వాటిలోఎక్కువ మంది వీక్షకులు చూసిన ఎపిసోడ్ గా నిలిచింది.

ఆ తర్వాత బాలకృష్ణ, ప్రభాస్ కి కొన్ని సినిమా డైలాగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోనివో చెప్పమన్నాడు. ఆ తర్వాత ఆ సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. "రాజమౌళితో ఛత్రపతి నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి?" అని బాలకృష్ణ అడిగాడు. "సినిమా నాలుగు రోజులకే.. ఆయన మంచి మనిషి అని తెలిసింది. ఆ తర్వాత ప్రెండ్స్ అయిపోయాం. ఆ తర్వాత ఏ షాట్ అయిన రెండు, మూడు టేక్సే.. ఛత్రపతి క్లైమాక్స్ షాట్ లో వర్షం, గుంపులుగా జనాలు ఉండేసరికి నాకు సిగ్గేసింది.ఇక నేను డైలాగ్ గట్టిగా చెప్పలేనని చెప్పాను. రాజమౌళి పిలిచి.. 'సరే ఎలా అయినా చెప్పు' అని అన్నాడు. ఆ తర్వాత డైలాగ్ చెప్పాను. 'టేక్ ఓకే' అని అన్నాడు. ఇక అప్పటినుండి జనాలుగా గుంపులుగా ఉన్నప్పుడు సైలెంట్ గానే డైలాగ్స్ చెప్తుంటాను.

" విశ్వనాథ్ గారితో సినిమా ఏంటి ఆ సినిమా? ఏం జరిగింది" అని బాలకృష్ణ అడిగారు. "అది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా. ఆరు నెలలు కష్టపడి సీన్స్ కొన్ని చేశాం. కానీ అవి అంతగా సెట్ కాలేదు. మళ్ళీ దిల్ రాజు పిలిచి 'పర్వాలేదు..మళ్ళీ తీద్దాం. మంచి సినిమానే చేద్దాం' అని చెప్పి ఫ్రీడం ఇచ్చాడు. విశ్వనాథ్ గారితో చేసిన ఒక సీన్ లో జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నేను సైలెంట్ గా డైలాగ్స్ చెప్పాను. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి పిలిచి 'ఇలా అయితే ఎలా.. ఓపెన్ గా చెప్పాలి డైలాగ్స్. అలా సిగ్గుపడితే ఎలా.. రాజమళి ఇదే నేర్పించాడా' అని అన్నారు. ఆ తర్వాత నేను " సర్.. సర్" అనే సరికి కూల్ అయ్యారు. "ఆ తర్వాత చేసిన సినిమాల డైరెక్టర్లు అందరు.. 'రాజమౌళి వల్లే.. డైలాగ్స్ అన్నీ ఇలా సైలెంట్ గా చెప్తున్నావ్ నువ్వు అని తిడుతుంటారు" అని ఫ్రభాస్ చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.