English | Telugu

అందరిముందు పిలిచి మరీ హగ్ ఇచ్చిన ప్రియాంక!

కొన్ని బాండింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విడదీయాలని చూసిన విడిపోని బంధం.. ఓ మనిషిని ప్రేమిస్తే కాదు కాదు ఆరాధిస్తే జీవితాంతం గుర్తుంచుకుంటానంటుంది ప్రియాంక సింగ్.

కొన్ని రోజుల క్రితం బాత్ టబ్ లో హాట్ డ్యాన్స్ చేస్తూ తీసిన ఓ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. చాలా కాలం క్రితమే జబర్ధస్త్‌లోకి సాయి తేజగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారడంతో ఈమె సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్‌కు పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో ఆమె కెరీర్ డౌట్‌లో పడిపోయింది. ఈ పరిస్థితుల్లోనే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. అప్పుడు మొత్తం 19 మంది హౌస్‌లోకి ఎంటర్ అవగా.. పింకీ మాత్రమే ప్రత్యేకంగా నిలిచి ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. తద్వారా ఫుల్‌గా క్రేజ్‌ను పెంచుకుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రియాంక సింగ్‌ బాగా హైలైట్ అయింది. కట్టు బొట్టు విషయంలో అమ్మాయిల కంటే పద్దతిగా కనిపించింది. మరీ ముఖ్యంగా ఈమె ఆరంభం నుంచే మానస్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వ్యవహరించింది. మొత్తంగా అందం, ఆట, ప్రేమ అన్నింటిలోనూ తనదైన రీతిలో అలరించింది. కానీ ఫినాలే ముందే ఎలిమినేట్ అయింది.

ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో మరింతగా యాక్టివ్ అయిందని చెప్పాలి. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలతో పాటు ఫొటోలు, వీడియోలను ఫాలోవర్లతో పంచుకుంటూ దూసుకుపోతోంది. ప్రియాంక సింగ్ జీ తెలుగులో 'సూపర్ జోడీ' అనే డ్యాన్స్ షోలో సందడి చేస్తుంది. ఈ షోకి బిగ్ బాస్ మానస్ వస్తాడని ఊహించట్లేదంట.. ఇక యాంకర్ ఉదయభాను ఓ ప్రశ్న అడిగింది.. మానస్ వాళ్ళ భార్య నీ కంటే అందంగా ఉంటుందా అని అడుగగా.. అఫ్ కోర్స్ నా కంటే అందంగా ఉంటుందని ప్రియాంక అంది. ఆ తర్వాత మానస్ ని ఏంటి మానస్ సిగ్గుపడుతున్నావా దా.. హగ్ ఇస్తా అని అడిగి మరీ.. తన దగ్గరకి వెళ్ళి హగ్ ఇచ్చింది. ఆయన ఎప్పుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఎప్పుడు కన్పించిన రెస్పెక్ట్ ఇస్తాడు. బయట కూడా హాయ్ మానస్ గారు అనే పిలుస్తానని ప్రియాంక అంది.