English | Telugu

నా కళ్ళకి సర్జరీ వల్ల మీ ముందుకి రాలేకపోతున్నాను!

ప్రస్తుతం సమాజంలో మనుషులతో పాటు హాస్పిటల్స్ పెరిగిపోయాయి. క్యాన్సర్ నుండి అల్సర్ వరకు అన్నింటికి శస్త్ర చికిత్స చేస్తూ నవీన పోకడ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయితే వీటి మీద ఎవేర్ నెస్ చేస్తూ కొంతమంది సెలెబ్రిటీలు వ్లాగ్ చేసుకుంటున్నారు. వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ ని చెప్తూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎన్నో ఉల్టా పల్టా ట్విస్ట్ లతో మొదలైంది. హౌస్‌లో ఉన్నప్పుడు ప్రియాంక కళ్ల జోడుపై చాలా కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ కళ్ల జోడుతో పనిలేకుండా చేశాడు ప్రియుడు శివకుమార్. గత 15 ఏళ్లుగా కళ్ల సమస్యతో బాధపడుతోంది ప్రియాంక అంటు ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పొట్టిపిల్ల మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. హౌస్ లోకి వచ్చాక శోభాశెట్టి, అమర్ దీప్ ల ఫ్రెండ్ షిప్ లో తను ఓ గ్రూప్ గేమ్ ఆడింది. ఎంతలా అంటే ప్రతీ నామినేషన్ లో తన స్నేహితులని కాకుండా స్పై బ్యాచ్ లోని శివాజీ, యావర్, ప్రశాంత్ లని టార్గెట్ చేయడం. ఏదై‌నా టాస్క్ లో తన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడంతో తనకి నెగెటివిటి వచ్చేసింది. ఎంతలా అంటే ఫ్యామిలీ వీక్ లో వచ్చిన శివ్, తేజస్విని గౌడ వచ్చినప్పుడు కూడా ఇండైరెక్ట్ గా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పారు. అయిన వాళ్ళ ఆటతీరు మార్చుకోలేదు‌. దీంతో ప్రియాంక మరింతగా నెగెటివిటి తెచ్చుకుంది. హౌస్ లో ఉన్నన్నిరోజులు కిచెన్ లోనే ఎక్కువగా ఉన్న ప్రియాంక.. భోలే షావలితో జరిగిన గొడవ ట్రోల్స్ కి దారితీసింది. ఇక సీజన్ సెవెన్ లో టాప్-5 లో ఉన్న ప్రియాంక.. టాప్-4 కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయింది. ఆ తర్వాత తనకి గ్రాంఢ్ గా వెల్ కమ్ లభించింది. శివ్, ప్రియాంకలిద్దరు ఎలిమినేషన్ తర్వాత రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు.

ఈ రోజుల్లో హాస్పిటల్‌కి వెళ్లని వాడు, ఆపరేషన్స్ కాని వాళ్లుంటే వేళ్లపై లెక్కపెట్టేయొచ్చు. రీసెంట్‌గా బిగ్ బాస్ ప్రియాంకకి కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఆపరేషన్ చేయించుకుంది. ఆ విషయాన్ని తన ప్రియుడు శివ్ ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చాడు. తనకి కంటి సమస్య ఉందని , ఈ రోజు ట్రీట్ మెంట్ చేపించామని శివ్ అన్నాడు. తమ పర్సనల్ యూట్యూబ్ ఛానెల్ లో.. నా కళ్ళకి సర్జరీ వల్ల మీ ముందుకి రాలేకపోతున్నాని టైటిల్ తో వ్లాగ్ చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది‌.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..