English | Telugu
Brahmamudi : కావ్యని సీఈఓగా చూసి షాకైన రాజ్.. ఇక దేత్తడే!
Updated : Oct 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -546 లో.....అపర్ణ ఇందిరాదేవి, కనకంలు కలిసి మళ్ళీ కావ్య రాజ్ ని కలపడానికి ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా కావ్య దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇప్పడేం ప్లాన్ తో వచ్చారని కావ్య అంటుంది. వాళ్లు పట్టించుకోకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. నీపై పడ్డ నిందని నిందగానే ఉంచుతావా దాన్ని పోగొట్టుకోవా అని ఇందిరాదేవి అంటుంది.
ఆ తర్వాత నువ్వు ఎక్కడో పని చేస్తేనే కదా ఇదంతా.. అదే మన కంపెనీ లో వర్క్ చేస్తే అప్పుడు అందరూ అనుకున్నది అబద్దం అనుకుంటారు. అందుకే నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలని అపర్ణ అనగానే.. లేదు అక్కడికి వెళ్లినా ఏదో ఒక వంక చెప్పి పంపించాలని చూస్తారని కావ్య అంటుంది. ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు చర్చించుకొని కావ్య దగ్గరికి వచ్చి.. నువ్వు కంపెనీలో ఎంప్లాయి అయితే తీసేస్తాడు.. అదే సీఈఓ అయితే తీసేయ్యడు. కంపెనీలో సీఈఓ గా ఉండమని అపర్ణ అంటుంది. వాళ్లు కావ్య ని ఒప్పింస్తుంటే.. అప్పుడే అనామిక వస్తుంది. కావ్య ఎక్కడ వర్క్ చెయ్యాలన్నా నా పర్మిషన్ కావాలి ఎందుకంటే నేనే అది ఈ అగ్రిమెంట్ ఇదిగో అని చూపిస్తుంది. అది అపర్ణ చదివి.. దీనికా నా కోడలిని బేదిరిస్తున్నావంటూ వెళ్లి యాభై లక్షలు చెక్కు.. ఇచ్చి ఇదిగో అందులో అనుకోకుండా వెళ్ళిపోతే ఇరవై అయిదు లక్షలు ఇవ్వాలని ఉంది ఎక్కువే ఇస్తున్నానని అపర్ణ అనగానే.. అనామిక డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత నీ పెళ్లి అప్పుడు రాజ్ రెండు కోట్లు ఇచ్చాడు.. అది కూడా ఇవ్వాలి నోటిసులు వస్తాయ్.. పిల్ల కాకి అని అనామికతో అపర్ణ అంటుంది.
ఆ తర్వాత అనామిక సిగ్గుతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక నీకు ఏ ప్రాబ్లెమ్ లేదని అపర్ణ, ఇందిరాదేవిలు చెప్పి కావ్యని ఒప్పిస్తారు. మరొకవైపు కళ్యాణ్ ఆటోలో ప్రొడ్యూసర్, రైటర్ ఎక్కుతారు. వాళ్ళు సాంగ్ గురించి మాట్లాడుకుంటుంటే.. కళ్యాణ్ సిచువేషన్ చెప్పినట్టు సాంగ్ పాడతాడు. దాంతో చాలా బాగా పాడావంటు ఇద్దరు మెచ్చుకుంటారు. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అది మీ రూమ్ కాదు సర్.. కొత్త సీఈఓ మేడమ్ వచ్చిందనగానే రాజ్ వెళ్లి చూసేసరికి కావ్య ఉంటుంది. తనని చూసి రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.