English | Telugu
24 గంటల్లో ఆర్య అనుకున్నది చేస్తాడా?
Updated : Jun 25, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొంది గత కొన్ని వారాలుగా ఉత్కంఠభరిత ములుపులు, ట్విస్ట్ లతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సీరియల్ ఆల్ మోస్ట్ చివరి అంకానికి వచ్చేసింది. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్.కె ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, రాధాకృష్ణ, అనూషా సంతోష్, కరణ్, మధుశ్రీ, ఉమా దేవి తదితరులు నటించారు.
రాగసుధ. అనుని నమ్మించి తన ట్రాప్ లో పడేలా చేసి ఆస్తి పత్రాలపై రాజనందిని తరహాలో సంతకం చేయిస్తుంది. అవే ఇప్పడు ఆర్యని ఇరికించడానికి ప్రధాన ఆస్త్రాలుగా మారతాయి. ఆ పేపర్లని ప్రధానంగా చూపిస్తూ రాగసుధ లాయర్ ఆర్య వర్థన్ ని ఇరికించాలని చూస్తుంటాడు. ఇదే సమయంలో ఆ పేపర్లపై వున్న సంతకం నాదేనని చెబుతుంది అను. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చనిపోయిన రాజనందిని పెట్టిన సంతకం మీరు ఎలా పెడతారని లాయర్ ఎదురుప్రశ్నిస్తాడు. అయినా సరే తానే రాజనందినిని అంటూ అను అరుస్తుంది.
దీంతో లాయర్ ఏదైనా మానసిక వైద్యుడికి తనని చూపించండని అవహేళన చేస్తాడు. జరిగింది అర్థం కాక ఆర్య వర్ధన్ తన భార్య మాటలకు తాను సారీ చెబుతున్నానంటాడు. కట్ చేస్తే.. నా క్లైంట్ కు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆర్య వర్ధన్ లాయర్ జడ్జిని కోరతాడు. ఇందు కోసం మాకు ఒక నెల గడువు ఇవ్వమంటాడు. అయితే నెల అవసరం లేదని, ఒకే ఒక్క రోజు చాలని చెప్పడంతో లాయర్ తో పాటు అంతా షాక్ అవుతారు. అయితే 24 గంటల్లో ఆస్తి తనదేనని తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకోకపోతే ఆస్తి మొత్తం రాగసుధకే చెందుతుందని తుది తీర్పు చెప్పాల్సి వుంటుందిని న్యాయమూర్తి ఆర్యని హెచ్చరించి గడువు ఇస్తాడు. 24 గంటల్లో ఆర్య అనుకున్నది చేస్తాడా?.. రాగసుధని అడ్డంగా బుక్ చేస్తాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.