English | Telugu

'ఢీ' షోకి తగ్గిపోతున్న రేటింగ్

బుల్లితెర పై ప్రసారమవుతున్న 'ఢీ' షోకి రేటింగ్స్ ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. 'ఢీ' డాన్స్ షోకి ఒకప్పుడు మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. రష్మీ, సుధీర్ హోస్ట్ గా చేసినంత కాలం కూడా ఈ డాన్స్ షో కి మంచి రేటింగ్స్ వచ్చేవి. శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించినప్పుడు మంచి ఎనెర్జీతో, జోష్ తో ముందుకు సాగేది. ఇప్పుడు వాళ్ళెవరూ ఈ షోలో లేకపోయేసరికి హద్దులు దాటిన ముద్దులతో, చెత్త పంచ్ డైలాగ్స్ తో షో మొత్తం గందరగోళంగా మారింది. డాన్స్ తక్కువ, సొల్లు ఎక్కువ అంటూ ఆడియన్స్ కూడా ఈ షోని తిడుతున్నారు. దీంతో ఈ షోకి రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ఇక ఇప్పుడు ఢీ షోకి గట్టి పోటీ ఇచ్చేందుకు 'ఆహా' సిద్ధమయ్యిందనే విషయం తెలిసిందే. 'డాన్స్ ఐకాన్' పేరుతో ఆహా రంగంలోకి దిగింది.

'తెలుగు ఇండియన్ ఐడల్' షో తర్వాత ఈ న్యూ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు అల్లు అరవింద్, ఓంకార్. ఈ షోలో పాల్గొనే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. ఈ షోకి ఫేమస్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జి గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ మాస్టర్ తో పాటు ఇంకొంత మంది జడ్జెస్ కూడా ఈ షో కి రావడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఇయర్ ఎండింగ్ వరకు బాలయ్య 'అన్‌స్టాప‌బుల్‌' షోతో పాటు డాన్స్ షో కూడా నిర్వహించేందుకు ఆహా టీం ప్రయత్నాలు స్టార్ట్ చేసేసింది.

ఢీ డాన్స్ షోకి రేటింగ్ పడిపోవడం ఒక ఎత్తు ఐతే దీనికి పోటీ ఇచ్చే మరో షో లేకపోయేసరికి ఈ విషయాన్ని కాష్ చేసుకోవడానికి అల్టిమేట్ గా ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు న్యూ టాలెంట్ కి వేదిక కల్పించేందుకు అన్ని రకాలుగా ఆహా సిద్దమయ్యింది. ఇక ఆ షో మొదలైతే మాత్రం ఢీ డాన్స్ షో పరిస్థితి ఏమిటో తెలీదు. ఉంటుందా, దుకాణం సర్దేస్తుందా అనేది చూడాలి.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.