English | Telugu
శోభ చెంప ఛెల్లు మనిపించిన సౌందర్య
Updated : Jun 25, 2022
ఈ రోజు ఎపిసోడ్ లో సౌందర్య, జ్వాల కోసం దోసకాయ పచ్చడి చేస్తాను అంటుంది. అయితే జ్వాల మాత్రం తనకు దోసకాయ పచ్చడి ఇష్టం వుండదని చెబుతుంది. ఆ తరువాత సౌందర్య గోరు ముద్దలు కలిపి జ్వాలకు తినిపిస్తూ ఆనందపడుతూ వుంటుంది. ఇదే సమయంలో జ్వాల బాధపడుతూ వుంటుంది. అది గమనించిన సౌందర్య .. జ్వాలను ఓదారుస్తుంది. ఆ తరువాత ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడనుంచి సౌందర్య వెళ్లిపోతుండగా శోభ ఫోన్ చేస్తుంది. నిరుపమ్ ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీకు శౌర్యని చూపిస్తాను అన్నాను కదా అంటుంది.
దానికి సౌందర్య `నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ పంపించు అక్కడికి వచ్చి నీతో కూల్ గా మాట్లాడతాను అంటుంది. వెంటనే శోభ నిజమే అనుకుని ఆనందిస్తూ సౌందర్యకు లొకేషన్ షేర్ చేస్తుంది. కట్ చేస్తే .. హిమ గురించి ఆలోచిస్తూ ప్రేమ్ బాధపడుతూ వుండగా నిరుపమ్ అక్కడి వస్తాడు. నువ్వు నా పెళ్లికి లేకుండా ముంబై వెళుతున్నావా? నువ్వులేకపోతే ఎలా రా అంటాడు. అయినా సరే ప్రేమ్ లో ఎలాంటి మార్పు వుండదు.
కట్ చేస్తే.. శోభ.. సౌందర్య కోసం ఎదురుచూస్తుండగా ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. అప్పుడు శోభ తన డీల్ గురించి మాట్లాడగా సౌందర్య.. శోభ చెంప ఛెల్లు మనిపిస్తుంది. అప్పుడు నా గురించి ఏమి అనుకుంటున్నావు అంటూ సౌందర్య ఇక్కడ అంటూ సీరియస్ అవుతుంది. నా ఫ్యామిలీ గురించి కానీ నా మనవరాలు, మనవడి గురించి గానీ ఒక్క మాట మాట్లాడినా నీ చాప్టర్ క్లోజ్ అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరో వైపు హిమ ఒంటరిగా నిలబడి జ్వాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన శోభ నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు అంటే జ్వాలకు ఫోన్ చేసి రెచ్చగొడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.