English | Telugu

మోస్ట్ ఎమోషనల్ గా సాగిన చిట్టీ ఆయిరే టాస్క్!


బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ ల పర్ఫామెన్స్ రోజు రోజుకి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతీ మనిషిలో ఒక ఎమోషన్ ఉంటుందంటూ ప్రతీ కంటెస్టెంట్ కి గతంలో ఒక బలం, బలహీనత ఉంటుందంటూ గుర్తుచేశాడు బిగ్ బాస్.

గురువారం నాటి ఎపిసోడ్ లో.. మొదటగా అందరు గురువులుగా మారి యావర్ కి అయిదు తెలుగు పదాలని నేర్పించాలని బిగ్ బాస్ ఒక టాస్క్ చెప్పాడు. ఈ టాస్క్ లో యావర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే అతని పార్టనర్ టేస్టీ తేజకి గుంజిళ్ళు తీయాలనే రూల్ చెప్పాడు బిగ్ బాస్. అందులో ఒక్కోక్కరు ఒక్కోలా కొన్ని పదాలని యావర్ కి నేర్పించారు. అక్కడ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు కాస్త ఎంటర్టైన్మెంట్ దొరికింది‌. ఇక ఆ తర్వాత 'బుజ్జిగాడు' సినిమాలోని 'చిట్టీ ఆయిరే ' పాటని ప్లే చేశాడు బిగ్ బాస్. అదే పాటతో లింక్ చేస్తూ కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఇందులో రూల్ ఏంటంటే.. ఇప్పుడు కంటెండర్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి వారి ఇంటి సభ్యుల నుండి లెటర్స్ వచ్చాయి. జోడీలోని ఏ ఒక్కరు డ్రాప్ అవుతారో, ఎవరు ముందుకెళ్తారో డిసైడ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ టాస్క్ లో ఎవరైతే కాంప్రమైజ్ అయి లెటర్ చదవొద్దని అనుకుంటారో వాళ్ళు గేమ్ నుండి అవుట్ అవుతారు. లెటర్ తీసుకొని చదివిన వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ తర్వాతి పోటీ లో ఉంటారని బాగ్ బాస్ చెప్పాడు.

ఇక ఈ టాస్క్ లో భాగంగా మొదటగా గౌతమ్ కృష్ణ-శుభశ్రీ యాక్టివిటీ ఏరియాకి వెళ్ళారు. అక్కడ ఇద్దరికి చెరొక లెటర్ ఉంది. ఇక ఇద్దరు డిసైడ్ అయి.. శుభశ్రీ కాంప్రమైజ్ అయి తన లెటర్ ని మిషన్ లో వేసి, కెప్టెన్సీ రేస్ నుండి తప్పుకుంటుంది‌. అయితే గౌతమ్ తన స్వార్థం కోసం శుభశ్రీని డ్రాప్ అవ్వమన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ- ప్రిన్స్ యావర్ లలో ఎవరో ఒకరు ముందుకు వెళ్దామని అనుకునే భాగంలో.‌. యావర్ ఎమోషనల్ అవుతాడు.

" వేరే వాళ్ళని బాధపెట్టి నేను గెలవాలని ఎప్పుడు అనుకోను. ఒకసారి నాకోసం ఎవరైనా ఏమైనా చేస్తే, చచ్చేదాకా వారిని గుర్తుంచుకుంటాను. నాకోసం మా అన్న లెటర్ పంపించాడు. నా కోపం, నా భాధ నేను వ్యక్తపరుస్తాను. కానీ నువ్వు ఎంతసేపు కామెడీ అంటూ హౌజ్ లో ఉంటున్నావ్. నీలోని ఎమోషనల్ పర్సన్ కి ఇది మళ్లీ మళ్లీ రాదు " అని టేస్టీ తేజతో అమర్ దీప్ చెప్పాడు. అయితే వాళ్ళ అమ్మనాన్నలు ఏం రాస్తారో తనకి తెలుసని యావర్ తో చెప్పి, ఈ రెండు లెటర్స్ నీకే ఇస్తున్నాను, నీ ఇష్టం ఏం చేస్తావో అని టేస్టీ తేజ యావర్ కి ఇవ్వగా.. అతను తన లెటర్ ని మిషన్ లో వేసాడు. టేస్టీ తేజ ఎంత వద్దని చెప్పినా యావర్ వినలేదు. ఆ తర్వాత టేస్టీ తేజ ఆ లెటర్ చదువుతూ ఏడ్చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గా సాగుతు.. బిగ్ బాస్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.