English | Telugu
రాత్రికి మాత్రమే మొగుడు కావాలట!
Updated : Oct 11, 2023
బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 22 వరకు బతుకమ్మ పండుగను జరుపుకోనున్నారు. 9రోజుల పాటు ఈ వేడుకలు సాగనున్నాయి. అలాంటి సందర్భంలో ఈటీవీ "పూల పండగ బతుకమ్మ" పేరుతో స్పెషల్ ఈవెంట్ చేసింది. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా రవి, అష్షు రెడ్డి వ్యవహరించారు. ఇక సీనియర్ నటులంతా ఒక వైపు..జూనియర్స్ అంతా ఒక వైపు కూర్చోబెట్టి గేమ్స్ ఆడించాడు రవి. నవ్వుల రాణి సునయన వేసిన జోక్స్ , అనిల్ రావిపూడి, బిత్తిరి సత్తి పంచ్ డైలాగ్స్ ఈ షోలో హైలైట్ గా ఉన్నాయి. ఈ ప్రోమో రీసెంట్ గా రీలీజ్ చేశారు.
ఫటాఫట్ వీరయ్య ...నా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి అంటూ సద్దాం స్టేజి మీదకు వచ్చేసరికి "రాత్రి మాత్రమే కనిపించి పగలు మాయమైపోయే మొగుడు కావాలి" అంటూ సునయన అడిగేసరికి తనకు కూడా అలాంటి అబ్బాయే కావాలంటూ పవిత్ర, వర్ష కూడా అడిగేసరికి సద్దాం ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. ఇంతలో ఒకప్పటి అందాల యాంకర్ శిల్ప చక్రవర్తి మైక్ తీసుకుని "ప్రతీ ఒక్కరికి సునయన హజ్బెండ్ ఎందుకయ్యా" అంటూ కౌంటర్ వేసింది. ఇక ఈ షోకి ప్రధాన ఆకర్షణగా అనిల్ రావిపూడి వచ్చారు. "భర్త భార్య దగ్గర సీక్రెట్స్ దాచిపెడతాడు ఎందుకట్లా" అని జోర్దార్ సుజాత అనిల్ రావిపూడిని ఒక ప్రశ్న అడిగింది.."జెనరల్లీ స్మోకింగ్ ఈజ్ ఇంజ్యురియస్ టు హెల్త్ అంటారు కానీ ఇక్కడ సీక్రెట్ షేరింగ్ ఈజ్ ఇంజ్యురియస్ టు హెల్త్" అంటూ కొత్తర్థం చెప్పి అందరినీ నవ్వించారు.