English | Telugu
కావ్య కోసం ఏడ్చేసిన కనకం, కృష్ణమూర్తి !
Updated : Oct 11, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -223 లో.. కావ్య ఎక్కడికి వెళ్లిందోనని కనకం టెన్షన్ పడుతు.. కావ్య ఫ్రెండ్స్ కీ ఫోన్ చేసి తన గురించి అడుగుతుంది. వాళ్ళు తెలియదని చెప్పగానే కనకం, కృష్ణమూర్తి ఇద్దరిలో మరింత టెన్షన్ మొదలవుతుంది.
మరొకవైపు కావ్యని రాహుల్ వెతకకుండా ఒక దగ్గర కూల్ డ్రింక్ తాగుతుంటాడు. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి వదిన గురించి అడుగుతాడు. కన్పించిదా అని అడుగగా.. లేదు వెతుకుతున్న అని రాహుల్ అబద్దం చెప్పి ఫోన్ కట్ చేసి రిలాక్స్ అవుతాడు. మరొక వైపు కావ్య గుడిలో కూర్చొని బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం ఒకొక్కరుగా కావ్యని వెతికి కన్పించకపోయేసరికి ఇంటికి వస్తారు. రాహుల్, కళ్యాణ్ ఇద్దరు ముందుగా వస్తారు ఆ తర్వాత సుభాష్ ప్రకాష్ లతో పాటుగా కాసేపటికి రాజ్ వస్తాడు. ఎవరికి కావ్య కన్పింకపోవడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు..
పగ తీర్చుకునే ప్రయత్నంలో నువ్వు ఏమైనా చేసావా అని రాహుల్ ని రుద్రాణి అడుగుతుంది.. అదేం లేదని రాహుల్ చెప్తాడు. కాసేపటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఏమైంది నా కూతురు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండని అపర్ణని నిలదీస్తుంది. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్ లేకుండా స్వప్న సోఫాపై పడుకోవడం చూసిన కనకం కోపంగా వెళ్లి.. స్వప్నని నిద్ర లేపుతుంది. నువ్వు మనిషివేనా మొన్న నువ్వు కన్పించకపోతే కావ్య ఎంత బాధపడింది..
అలాంటిది నువ్వు ఎంత బాగా నిద్రపోతున్నావని స్వప్నని తిడుతుంది. ఆ తర్వాత నా కూతురిని మీరేమీ అనకుంటే ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళిపోతుంది. నా కూతురు నీ నాకు తీసుకొని వచ్చి ఇవ్వండని కనకం ఏడుస్తుంది. ఇంట్లో ఏ గొడవ జరగలేదు. ఎందుకు వెళ్లిందో మాకే అర్థం కావడం లేదని అపర్ణ చెప్తుంది.
మరొక వైపు కృష్ణమూర్తి బాధపడుతు.. మీ కొడుకు ఇంట్లో నుండి నా కూతురిని గెంటేస్తే నేను తీసుకోని వెళ్తానని అంటే.. నా కూతురుగా చూసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు నా కూతురు ఎక్కడ అని సుభాష్ ని కృష్ణమూర్తి నిలదీస్తాడు. నా కూతురు ఈ ఇంటికి కోడళ్ళు అయ్యారు. వాళ్లని కాపాడుకులేనీ నా అల్లుళ్ళు చేతకానీవాళ్ళా? రెండు సార్లు నా పెద్ద కూతురు కిడ్నాప్ అయింది. ఇప్పుడు నా చిన్న కూతురు అంటూ కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతాడు.
ఆ తర్వాత రుద్రాణి.. ఆపుతారా అంటూ కనకం, కృష్ణమూర్తి లను కోప్పడుతుంటుంది. అలా రుద్రాణి అనడంతో తనని సీతారామయ్య కోప్పడతాడు.. ఏంటి నువ్వు.. తన బిడ్డపై ప్రేమతో అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతూన్నావని సీతరామయ్యా అంటాడు. కాసేపటికి కనకానికి ఇందిరాదేవి నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.