English | Telugu

దయచేసి బాడీ షేమింగ్ చేయొద్దు..ఎవరినీ బాధపెట్టొద్దు!


బిగ్ బాస్ షోని రివ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో మస్త్ పేరు సంపాదించింది చిత్తూర్ అమ్మాయి గలాటా గీతూ రాయల్. టిక్‌టాక్ వీడియోలు చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో కనిపిస్తూ , యూట్యూబ్‌ వీడియోస్ చేస్తూ ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఇక ఈ మధ్య జబర్దస్త్ లో కూడా అడుగు పెట్టింది. ఐతే బిగ్ బాస్ సీజన్ 6 కి ఈమెను సెలెక్ట్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా తన యూట్యూబ్ ఛానల్ లో బాడీ షేమింగ్ గురించి ఒక వీడియో చేసి పెట్టింది.

అందులో లైవ్ లో మాట్లాడుతూనే ఫుల్ గా ఏడ్చేసింది. ఇంట్లో వాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా తన బాడీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు బస్ట్ ఎక్కువని ఆ విషయం చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉందని, ఇష్టమైన డ్రెస్స్ వేసుకోలేకపోతున్నానని, చాలామంది తన వైపు వింతగా చూస్తారని బాధ పడింది. ఒక టైంలో తనకు బ్రెస్ట్ కాన్సర్ ఇవ్వు దేవుడా అని కూడా ప్రార్దించిందని అలా అన్నా డాక్టర్స్ బ్రెస్ట్ ని రిమూవ్ చేసేస్తే తనకి ఈ బాధలు ఉండవ్ కదా అని చెప్పింది.

అందరివల్లా తన బాడీ అంటే తనకు ఎప్పుడూ ఇష్టం ఉండదని కానీ కొంతమంది స్నేహితుల మాటలు విన్నాక అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. "నువ్వంటే నువ్వే కానీ నీ శరీరం కాదు" అని తన ఫ్రెండ్ చెప్పిన మాటలను తన వీడియోలో ప్రెజంట్ చేసి దయచేసి ఎప్పుడూ బాడీ షేమింగ్ చేయొద్దు ఎవరిని అంటూ ప్రాధేయపడింది. జనాలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని అస్సలు పట్టించుకోవద్దని చెప్పింది. ఎవరి లైఫ్‌లో వాళ్లే హీరోలని, ఎవరికి వాడే తోపు అని గీతూ చెప్పింది. శరీరం పై అయిష్టత పెంచుకున్నవాళ్లను మోటివేట్ చేయండి కానీ ఇలా బాడీ షేమింగ్‌పై కామెంట్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.