English | Telugu

పూర్ణ ఎక్కడుంటే అక్కడ ముద్దులే ముద్దులు!

జబర్దస్త్ షోతో రష్మీ ఎలా ఫేమస్ అయ్యిందో, ఢీ షో ద్వారా పూర్ణ కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్ ప్రోమో ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ వారం విలేజ్ షో టైటిల్ తో కంటెస్టెంట్స్ డాన్స్ పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ కి 'వీ ఆర్ బ్యాక్' అంటూ పూర్ణ, అఖిల్ సత్తార్, జానీ మాస్టర్ స్టేజి మీదకి వచ్చారు. పూర్ణ `ఢీ` 13 సీజన్‌లో జడ్జ్ గా వ్యవహరించింది. ఈ షో వలన తనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయని ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. చాలా క్యూట్ గా మాట్లాడుతూ అప్పుడప్పుడు అందంగా డాన్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయింది. ఐతే ఢీ 14 సీజన్ నుంచి ఆమె కనిపించడం మానేసింది.

తానే వెళ్లిపోయిందా.. పక్కకు తప్పించారా అనే విషయం మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఐతే మళ్ళీ ఇన్నాళ్లకు ఈ షోకి రీఎంట్రీ ఇచ్చేసింది పూర్ణ. గణేష్ మాస్టర్ ప్లేస్ లో జానీ మాస్టర్, నందిత శ్వేత ప్లేస్ లో పూర్ణ వచ్చేసారు. ఐతే వీళ్ళ ఎంట్రీ పెర్మనెంటా లేదా టెంపరరీనా అనే విషయం మాత్రం ఇంకా తెలీదు. ఇక ఈ ఎపిసోడ్ లో పూర్ణ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో ఆర్నాల్డ్ అనే పిల్లాడి డాన్స్ కి ఫిదా ఐపోయిన పూర్ణ పిలిపించి మరీ ముద్దు పెట్టించుకుంది. ఆ సీన్ తో అందరూ షాక్ ఐపోయారు. తర్వాత దిషా అనే లేడీ డాన్సర్ వచ్చి "ఆ అంటే అమలాపురం" సాంగ్ కి ఇరగదీసే డాన్స్ చేసేసింది.

ఈమె డాన్స్ కి అంద‌రూ విజిల్స్ వేశారు. పూర్ణ మాత్రం ఎక్కడా తగ్గేదే లే అంటూ ఆమెని పిలిచి మరీ బుగ్గ కోరికేసింది. అది మామూలుగా బుగ్గ కొరకడం కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 'పూర్ణ ఎక్కడుంటే అక్కడ ముద్దుల గోలే.. నాటీ పూర్ణ' అంటున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.