English | Telugu

సండే ఆటలో పల్లవి ప్రశాంత్ విన్నర్.. అమర్ దీప్ లూజర్!

బిగ్ బాస్ సీజన్-7 లో ప్రతీ వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అయితే సన్ డే ఫన్ డే అంటూ సాగే ఈ ఎపిసోడ్‌ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.‌ ఇప్పటికే రెండు వారాలు పూర్తిచేసుకుంది బిగ్ బాస్. కాగా ఇద్దరు ఎలిమినేషన్ అవగా పన్నెండు మంది కంటెస్టెంట్స్ మిగిలారు.

బిగ్ బాస్ సీజన్-7 హోస్ట్ నాగార్జున సండే రోజు ట్రెండీ డ్రెస్ తో రాక్ స్టార్ లా వచ్చాడు. వినాయకచవితి సందర్భంగా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి పూలు చల్లాడు. ఆ తర్వాత తనదైన స్టెప్పులతో డ్యాన్స్ అదరగొట్టాడు. కాగా ఇక సండే ఫంఢే రోజు గేమ్స్ తో అలా సందడి చేశాడు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరిని పిలిచి ఒక గేమ్ ఆడించాడు నాగార్జున. సినిమాలోని ఒక స్టిల్ వస్తుంది. అది ఏ సినిమాలోనిది చెప్పాలని నాగార్జున చెప్పాడు. అయితే అక్కడ ఒక బెల్ ఇచ్చి అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లకి చెరొక సుత్తి ఇచ్చి ఎవరు మొదట బెల్ కొడతారో వారికే సమాధానం చెప్పే ఛాన్స్ వస్తుందని నాగార్జున చెప్పాడు. అయితే ఈ వారం జరిగిన రణధీర నుండి అమర్ దీప్, మహాబలి టీమ్ నుండి పల్లవి ప్రశాంత్ లు వచ్చారని నాగార్జున చెప్పి, ఈ గేమ్ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ అందుతుంది. స్పెషల్ పవర్స్ వస్తాయని నాగార్జున అన్నాడు.

ఇక పల్లవి ప్రశాంత్ తన దూకుడు ప్రదర్శించాడు. ఆటలో యాక్టివ్ గా ఉంటు తన మహాబలి టీమ్ ని గెలిపించి లగ్జరీ బడ్జెట్ వచ్చేలా చేశాడు. అయితే పల్లవి ప్రశాంత్ బెల్ కొట్టే ప్రతీ సారీ అమర్ దీప్ అతడిని అరేయ్, ఓరేయ్ అంటూ మర్యాద లేకుండా అన్నాడు. ఇక గేమ్ అని నాగార్జున కూడా ఏం అనలేకపోయాడు. కాగా ఈ గేమ్ లో అమర్ దీప్ ఓడిపోయాడు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు. దీంతో హౌజ్ లో అందరికి పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తెలిసిపోయింది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..