English | Telugu
ఆ డబ్బులు వాళ్ళవే... శివాజీ అన్నకి ఋణపడి ఉంటాను!
Updated : Dec 19, 2023
బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్‌లలో ఒక కామన్ మ్యాన్ కప్ గెలవడం ఇదే ప్రథమం. దాంతో పల్లవి ప్రశాంత్ ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ గా నిలిచాడు. ఇక విజేత అయిన తర్వాత జరిగిన బజ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు పల్లవి ప్రశాంత్.
ఎవిక్షన్ పాస్ ఎవరికోసం యూజ్ చేద్దామని అనుకున్నావని అడుగగా.. రతిక కోసం వాడుదామని అనుకున్నా కానీ తను నాతో ఫస్ట్ ఉన్నట్టు లేదు. అందుకే వాడలేదు. యావర్, శివాజీ ఇద్దరిలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడాలంటే ఎవరికి వాడతావని అడుగగా.. అయ్యో పెద్ద ప్రశ్నే వేశారు కదా. ఇద్దరు నాకు ఎక్కువే. కానీ శివాజీ అన్నకే ఇస్తాను ఎందుకంటే నేను హౌస్ లోకి వచ్చినప్పుడు ఒక భయం ఉండేది. నాకు అన్ననే మొదట కనెక్ట్ అయ్యాడు. కామన్ మ్యాన్ అంటు దగ్గరికి తీసుకున్నాడు. ఎలా ఉండాలో చెప్పాడు. నాకోసం ఇంటినుండి వచ్చిన లెటర్ ని సాక్రిఫైజ్ చేశాడు. ఇక అప్పుడే డిసైడ్ అయ్యా గెలిచి చూపిస్తా అని శివాజీ అన్నకి మాటిచ్చా మొట్టమొదటి కెప్టెన్ గా నిలిచానని ప్రశాంత్ అన్నాడు. అర్జునుడికి కృష్ణుడి బాణం తోడైనట్టు శివాజీ అన్న నీకు తోడుగా నిలిచాడు కదా అని అడుగగా.. అవును. నేను పొలం దగ్గర పనిచేస్తున్నప్పుడు మా నాన్న ఎలా అయితే నాతో ఉన్నాడో అలాగే హౌస్ లోకి వచ్చాక అన్నే నాతో ఉన్నాడు. సపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు స్మైల్ టాస్క్ లో.. పళ్లు (టీత్) తీసుకొచ్చేప్పుడు అన్న పడ్డాడు. ఇక మెల్లిగా వెళ్తుండు ఏం అయింది అన్న పరుగెత్తు అంటే నాతో అయితలేదు రా, చేయి లేత్తలేదురా అన్నాడు. షాక్ అయ్యాను ఆ తర్వాత అయ్యో ఏం అయింది అన్న నేను మస్త్ బాధపడ్డాను. నా లైఫ్ లో నా కోసం ఎవరు త్యాగం చేయలేదు. ఫస్ట్ టైమ్ అన్నే నాకోసం త్యాగం చేశాడు. నువ్వు ఉండాలే, గెలవాలే కామన్ మ్యాన్ గా వచ్చావ్. ఎంతోమంది రైతులకి ఆదర్శం కావాలని అన్న నాకోసం లెటర్ ని త్యాగం చేశాడంటూ ఏడ్చేశాడు ప్రశాంత్. విన్ అయ్యావ్ ప్రశాంత్ ఎందుకు ఏడుస్తున్నావని అడుగగా.. లెటర్ సాక్రిఫైజ్ చేసాక గెలిచి చూపిస్తా అని చెప్పాను. ఇక కలర్ పూసుకునే టాస్క్ లో అన్న నా దగ్గరికి వచ్చి అరేయ్ నిన్ను అందరు టార్గెట్ చేసారురా, నిన్ను ఆడనవ్వరురా వచ్చేయ్ అని చెప్పి అన్న లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను గెలిచి అన్న దగ్గరికి వెళ్ళాను. చూపెట్టినవ్ రా కామన్ మ్యాన్ పవర్ చూపెట్టినవర్ రా అని అన్న ప్రతీసారీ నాకు సపోర్ట్ గా ఉన్నాడని ప్రశాంత్ అన్నాడు.
ఒకవేళ శివాజీ అన్న సపోర్ట్ లేకుంటే నువ్వు గెలిచేవాడివి కాదా అని అడిగినప్పుడు.. లోపల నాకు ఎవరు తెలియదు అన్న మాటలు నాకు ధైర్యమిచ్చాయి. అన్న గేమ్ ఎలా ఆడాలో చెప్పడు. ఎవరైన ఏం అయిన అన్నప్పుడు నా దగ్గరికొచ్చి సపోర్ట్ గా, నాకు ధైర్యంగా ఉండేవాడని ప్రశాంత్ అన్నాడు. రైతుబిడ్డ అనే పేరుని నీకు సింపతీ కోసం వాడుకున్నావేమోనని కొందరు అనుకుంటున్నారని అడిగినప్పుడు.. అటువంటేదేమీ లేదు. రెండో వారంలో అందరు నామినేషన్ చేసినప్పుడు అదే చెప్పాను. బయట నేను రైతుబిడ్డని కానీ హౌస్ లో ఎప్పుడు అది వాడ లేదని రతికతో కూడా అన్నానని, మళ్ళీ పదోవారంలో గెలిచాక రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అని అన్నట్లుగా చెప్పాడు. నీకొచ్చిన ముప్పై అయిదు లక్షలు ఏం చేస్తానని అడుగగా.. రైతులకోసమే ప్రతీ రూపాయి వాడతాను. ఒక్కో రూపాయి కష్టాల్లో ఉన్న రైతులేవరో కనుక్కొని, లేనివాళ్ళకి ఇస్తూ వీడియోలు కూడా పెడతానని అన్నాడు. నీకోసం నువ్వు ఆడినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోవా అని అడిగినప్పుడు.. నేను వచ్చిందే రైతుల కోసం, ఆ డబ్బులు వాళ్ళవే అని ప్రశాంత్ అన్నాడు. ఆ తర్వాత కొన్ని మీమ్స్ చూపించగా కాసేపు నవ్వుకున్నాడు ప్రశాంత్. ఆ తర్వాత తన మిర్చీ మొక్కని ప్రశాంత్ కి గిఫ్ట్ గా ఇచ్చింది గీతు.