English | Telugu
రతికతో పులిహార కలిపినప్పుడు భయమేసింది
Updated : Mar 7, 2025
బుల్లితెర నటులు ప్రియాంక జైన్ - శివ కుమార్ ఇద్దరూ కలిసి ఈ మధ్య కొత్తగా ఒక కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ప్లాన్ కనిపెట్టారు. అదేంటంటే మిగతా సెలబ్రిటీస్ తో వాళ్లకు నచ్చిన వంటల్ని వాళ్ళతోనే చేయించడం. ఇక ముందుకా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ తో వంట చేయించారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో వంట చేయించారు. ఇక ప్రియాంక - శివ్ - ప్రియాంక వాళ్ళ అమ్మ అంతా కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రియాంక వాళ్ళను చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.
ఇక ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రశాంత్ ఫొటోస్ ని చూపించింది. ఇక పల్లవి వాళ్ళ నాన్న ఐతే "మీరు వెళ్ళినప్పుడు బిగ్ బాస్ చాల బాగుంది ..ఇప్పుడు ఇంతకు ముందు లెక్క లేదు.." అంటూ కామెంట్స్ చేసాడు. అలాగే పల్లవి బిగ్ బాస్ హౌస్ లో పల్లవి కలిపిన పులిహోర గురించి మాట్లాడాడు. రతికాతో పల్లవి పులిహోర కలిపినప్పుడు చాల భయం వేసింది అని చెప్పాడు. తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటికి వచ్చాక అందరూ కలిసి బిగ్ బాస్ ఆల్బం ని చూసి బిగ్ బాస్ మెమోరీస్ ని మళ్ళీ రికలెక్ట్ చేసుకున్నారు. ఇక శివ్ కుమార్ ఐతే తనకు పల్లవి వాళ్ళ ఇల్లు ఆ పల్లె వాతావరణం బాగా నచ్చిందని చెప్పాడు. ఇక అందరూ కలిసి పల్లవి వాళ్ళ పొలం లోకి వెళ్లి కుంపటి పెట్టి అక్కడ అన్నం, పప్పు, రోటి పచ్చడి చేయాలనీ డిసైడ్ అయ్యారు. అలాగే పొలంలో ఫ్రెష్ గా పండిన టొమాటోస్ ని ప్రియాంక కోసింది. వాటితో అక్కడ వంట చేసింది. తర్వాత శివ్ అందరికీ వడ్డించాడు.