English | Telugu

పల్లకిలో పెళ్లికూతురు ..ఈ సీరియల్ డాక్టర్ బాబు క్రేజ్ ని పెంచుతుందా ?


బుల్లి తెరపై నిరుపమ్ పరిటాలకు ఉన్నంత క్రేజ్ మరే ఆర్టిస్ట్ కి లేదు. కార్తీక దీపంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. నిరుపమ్ తన వైఫ్ తో కలిసి చంద్రముఖి సీరియల్ తర్వాత పెద్దగా ఎక్కడా కలిసి నటించడం లేదు. ఈ విషయం పై వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో మంజుల గతంలో క్లారిటీ కూడా ఇచ్చింది. ఇద్దరం కలిసి నటించలేము అని చెప్పింది. కానీ ఇప్పుడు నిరుపమ్ తీస్తున్న సీరియల్ పల్లకిలో పెళ్లికూతురులో మంజుల నటిస్తోంది.

నిరుపమ్ సీరియల్స్ నిర్మిస్తుంటాడు అన్న విషయం తెలిసిందే . తన తండ్రి పేరు ఓంకార్. అందుకే ఆయన పేరు వచ్చేట్టుగా ఓం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సీరియల్స్ నిర్మిస్తుంటాడు. ఇది వరకు "హిట్లర్ గారి పెళ్లాం" సీరియల్‌ నిర్మించాడు అందులో నటించాడు కూడా. జీ తెలుగులో ప్రసారం ఐన ఈ సీరియల్ తక్కువ టైములో ఎక్కువ పేరు సంపాదించేసింది. కాకపొతే ఈ సీరియల్ చాలా తక్కువ టైంలోనే పూర్తైపోయేసరికి ఫాన్స్ బాధపడ్డారు. ఇంకో సీరియల్ ఎప్పుడు ఎప్పుడు అంటూ అడుగుతున్న ఫాన్స్ కి ఇప్పుడు మంజుల, నిరుపమ్ గుడ్ న్యూస్ చెప్పారు.

తాజాగా తాను నిర్మిస్తోన్న కొత్త సీరియల్ గురించి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ డేట్ ఇచ్చాడు . "పల్లకీలో పెళ్లికూతురు" అనే కొత్త సీరియల్ , సరి కొత్త కథతో రాబోతోందని, అది స్టార్ మాలో వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో మంజుల కూడా ఓ పాత్రలో కనిపిస్తోంది. ఐతే ఇందులో నిరుపమ్ నటిస్తాడా ? లేదా? అనే విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ తెలియదు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..