Read more!

English | Telugu

ఎనిమిదో వారం హీటెడ్ నామినేషన్లు.. మళ్లీ టార్గెట్ భోలే షావలేనా!


బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ సాగుతుంది. అదే సోమవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాగ్వాదం కోర్ట్ రూమ్ లో జరిగే కేసుల వాదనలను తలపించాయి.

హౌస్ కెప్టెన్ అంబటి అర్జున్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయొద్దని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియను మొదట శివాజీ ప్రారంభించాడు.‌ ప్రియాంక, శోభాశెట్టిలని శివాజీ నామినేట్ చేశాడు. "భోలే సారీ చెప్పిన ఆక్సెప్ట్ చేయలేదు" అని శోభాకి శివాజీ చెప్పి నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక, శోభాశెట్టి లని 
అశ్విని శ్రీ నామినేట్ చేసింది. తనతో  ఎవరు మాట్లాడటం లేదని అశ్విని శ్రీ నామినేట్ చేసింది. భోలే షావలి, అశ్వినిశ్రీలని ప్రియాంక నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడలేదని, బూతులు వాడొద్దని, నటించొద్దని చెప్తూ భోలే షావలిని ప్రియాంక నామినేట్ చేసింది‌. అశ్వినిశ్రీని, భోలే షావలిని ఆట సందీప్ నామినేట్ చేశాడు. టాస్క్ లోకి పంపించట్లేదని,
ఇరిటేట్ అయ్యావ్. ఆ రోజు నువ్వు అడిగిన విధానం ఇలా లేదని అశ్వినిశ్రీని ఆట సందీప్ అన్నాడు. 

బూతు మాట్లాడటం తప్పు అని భోలే షావలిని ఆట సందీప్ నామినేట్ చేశాడు. "నాకు మోషన్స్ వచ్చిన తట్టుకుంటాను కానీ ఎమోషన్స్  వస్తే తట్టుకోలేనని ఆట సందీప్ తో భోలే షావలి అన్నాడు. భోలే షావలిని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. నువ్వు గేమ్ ఆడలేదు. హౌస్ లో నువ్వు వీక్ అని నాకనిపిస్తుందని గౌతమ్ కృష్ణ రీజన్ చెప్పాడు. ఇది నామినేషన్ల మొత్తంలో చెత్త రీజన్ అనిపించింది. ఇలా ఒక్కో నామినేషన్ లో కంటెస్టెంట్స్ చెప్పే రీజన్స్ అన్నీ తుప్పాస్ రీజన్స్ లా అనిపించాయి. అయితే వీరి మధ్య జరిగిన ఇంటెన్స్ డ్రామాని తలపించాయి.